»   » అప్పుడే ఫస్ట్ లుక్ కూడా వచ్చేసిందా...!? ఆలియా ఎంత ముద్దొస్తోందో

అప్పుడే ఫస్ట్ లుక్ కూడా వచ్చేసిందా...!? ఆలియా ఎంత ముద్దొస్తోందో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్ర‌స్తుతం బాలీవుడ్ లో అలియా భ‌ట్ పేరు మారుమోగుతుంది. మొన్న ఈ మ‌ధ్య రిలీజ్ అయిన ఉడ్తా పంజాబ్ లో త‌ను చేసిన రోల్ కు విమ‌ర్శ‌కుల‌తో పాటు.. ఆడియ‌న్స్ నుంచి కూడ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ సూప‌ర్ స్టార్స్ లో ఒక‌రైన షారుక్ తో క‌ల‌సి 'డియర్‌ జిందగీ' పేరుతో ఒక చిత్రం చేసింది. ఈ చిత్రం ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేసింది మూవీ యూనిట్. ఈసినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది.ఈ చిత్ర కథ గురించి తెలియకపోయినా కొత్త తరహాలో సాగుతుందని బాలీవుడ్‌లో అనుకుంటున్నారు.

చాలా పేర్లు అనుకున్నాక ఈ సినిమాకు 'డియర్‌ జిందగీ' అనే టైటిల్‌ నిర్ణయించారు. అధికారికంగా ప్రకటించేసారు కూడా ఈ చిత్రంలో ఆలియాదే కీలక పాత్ర అని, ఆమె ఫిల్మ్‌ మేకర్‌గా కనిపించబోతున్నట్లు తెలిసింది. షారుఖ్‌ పాత్ర నిడివి తక్కువే అయినా కీలకంగా ఉంటుందని సమాచారం.ఈ చిత్రంలో షారూఖ్‌ కేవలం 30 నిమిషాల పాటే ప్రేక్షకుల్ని అలరించనున్నాడట. ట్రెండీ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతున్న ఈచిత్రంలో ఆలియా షారుఖ్ ల మధ్య కథ అద్బుతమైన ఎమోషన్స్ తో కూడి ఉంటుందట.

రకరకాల రిలేషన్‌షిప్స్‌తో అలియా జీవితంలో చోటుచేసుకున్న వైవిధ్యమైన అంశాల సమాహారమే ఈ చిత్రం. ఈచిత్రంలో పరిచయాలు, పరిస్థితుల ప్రభావానికి లోనైన అలియాకి లైఫ్‌కోచ్‌గా షారూఖ్‌ నటిస్తున్నాడు. ఈ ఇద్దరి జోడీ ఒక గురు శిష్య బంధం లానూ, ఇద్దరు మిత్రుల అనుబందం గానూ ఉంటుందట.

Shah Rukh Khan-Alia Bhatt's Dear Zindagi first look

మొన్నటికి మొన్న ఉడ్తా పంజాబ్ లో పూర్తి డీ గ్లామరైజ్ద్ రోల్ చేసిన ఆలియా ఈ సినిమాలో మాత్రం తన లుక్ పూర్తిగా మార్చేసింది. ఒక ఇంటలిజెంట్ మూవీ మేకర్ గా ఉండాల్సిన బాడీ లాంగ్వేజ్ తో పాత్రలో ఒదిగి పోయింది అన్న యూనిట్ మాటలు పూర్తిగా నమ్మొచ్చు అన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఒక దాని వెంట ఒకటి వేరు వేరు షెదస్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ... మూసలో పడిపోకుండా తనకంతూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటోంది ఆలియా...

షారుక్‌ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది.ఈ సినిమాకి గౌరీ షిండే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌లో ఆలియా ఫోన్‌లో మెసేజ్‌ చూస్తుంటే.. అది చూసి షారుక్‌ మురిసిపోతున్నాడు. నవంబర్‌ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
Superstar Shah Rukh Khan and Alia Bhatt on Tuesday revealed the first look of director Gauri Shinde's upcoming "Dear Zindagi".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu