»   » అదిరిందంతే : షారుక్‌, కాజోల్‌... ఓ సరదా వీడియో

అదిరిందంతే : షారుక్‌, కాజోల్‌... ఓ సరదా వీడియో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్‌ హిట్‌ పెయిర్‌ షారుక్‌ ఖాన్‌, కాజోల్‌లు జంటగా నటించిన 'దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే' 20 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 'దిల్‌వాలే' దర్శకుడు రోహిత్‌ శెట్టి డీడీఎల్‌జే చిత్రంలోని రాజ్‌(షారుక్‌), సిమ్రాన్‌(కాజోల్‌)ల పాత్రలను మళ్లీ షూట్‌ చేసి ఓ సరదా వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

Shah Rukh Khan, Kajol rekindle their DDLJ chemistry

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ వీడియోలో రాజ్‌, సిమ్రాన్‌లు తాము ప్రేమలో ఉన్న రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు. షారుక్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఈ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో షారుక్‌, కాజోల్‌లు జంటగా 'దిల్‌వాలే' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

1995 అక్టోబర్ 20న రిలీజ్ అయిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ఇప్పటికీ ముంబై మరాఠా మందిర్ రోజూ ప్రదర్శింపబడుతూనే ఉంది. ఇప్పటికీ ఈ సినిమాను ప్రేక్షకుల ఆదరిస్తూనే ఉన్నారు. షారూక్ ఖాన్, కాజోల్ హీరో హీరోయిన్లుగా అనుపమ్ ఖేర్, అమ్రీష్ పూరి లాంటి మహానటులు నటించిన ఈ సినిమాను ఆదిత్య చోప్రా తొలిప్రయత్నంగా డైరెక్ట్ చేశాడు. ఎటువంటి అనుభవం లేకపోయిన భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయే అద్భుత ప్రేమకథను వెండితెర మీద ఆవిష్కరించాడు.

అందుకే ఏకంగా పది ఫిలిం ఫేర్ అవార్డ్ లతో పాటు బెస్ట్ పాపులర్ ఫిలింగా నేషనల్ అవార్డ్ కూడా సాధించింది దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే. దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే ఇచ్చిన ఇన్సిపిరేషన్ తో ఇప్పటికీ ఇదే లైన్ తో ఇండియన్ సినిమాలో ఎన్నో చిత్రాలు తెరకెక్కుతూనే ఉన్నాయి. మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఇంతటి ఘనవిజయం సాధించిన దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ ఓ స్పెషల్ వీడియో రూపొందించింది.

English summary
When Shah Rukh Khan and Kajol starrer ‘Dilwale Dulhania Le Jayenge’ released 20 years back, nobody would have anticipated the love it will get in its run. The romantic classic tugged at the heartstrings of one and all back then and continues to do so even now.
Please Wait while comments are loading...