»   » సూపర్ స్టార్ కారుపై రాళ్ల దాడి

సూపర్ స్టార్ కారుపై రాళ్ల దాడి

Posted By:
Subscribe to Filmibeat Telugu

అహ్మదాబాద్: బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్‌ ఖాన్ కారుపై రాళ్ల దాడి జరిగింది. గుర్తుతెలియని దుండగులు రాళ్లతో దాడి చేసిన ఘటన అంతటా కలకలం రేపింది. ఈ విషయం తెలిసిన వెంటనే అబిమానులు కంగారుపడ్డారు. అయితే అదృష్టవశాత్తు దాడి జరిగిన సమయంలో కారులో షారూఖ్ ఖాన్ లేరు.

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన కారుపై దాడి చేసిన దుండగులు ఎవరో వెల్లడికాలేదు. ఎందుకు దాడి చేశారనేది కూడా తెలియరాలేదు.

రాళ్ల దాడిలో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు. కాగా, షారూఖ్ ఖాన్ తాజా చిత్రం 'రాయిస్' షూటింగ్ అహ్మదాబాద్ లో జరుగుతోంది. ఆ మధ్యన ఆయన అసహనం పై చేసిన వ్యాఖ్యలు ఫలితం అయ్యిండవచ్చు అని కొన్ని బాలీవుడ్ మీడియా సంస్ధలు ఊహాగానాలు చేస్తున్నాయి.

Shah Rukh Khan’s car comes ‘under attack’ in Ahmedabad

అయితే షారూఖ్ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు, తప్పుగా అర్దం చేసుకోవద్దని, క్షమాపణ సైతం కోరారు. మరి అసలు ఎందుకు ఈ దాడి జరిగిందో బయిటకువస్తే కానీ దేని ప్రబావం అనేది చెప్పలేం.

ఆ మద్య షారూఖ్ ఖాన్ మాట్లాడుతూ...‘‘రాజకీయ, మత సంబంధ విషయాలపై మీరెన్ని ప్రశ్నలు వేసినా నేను మాట్లాడను. ఇటువంటి వాటిపై నేనేం మాట్లాడినా వివాదాస్పదమవుతోంది. అందుకే నేను మీ ప్రశ్నలకు సమాధానం చెప్పాలనుకోవడంలేదు. గతంలో నేను ‘అసహనం'పై చేసిన వ్యాఖ్యల ప్రభావం ‘దిల్‌వాలే' సినిమా కలెక్షన్లపై పడింది. అందుకే ఇటువంటి విషయాలపై మాట్లాడదలచుకోలేదు.'' అన్నారు.

English summary
Bollywood superstar Shah Rukh Khan’s vehicle was attacked by unidentified persons in Ahmedabad city of Gujarat early on Sunday morning.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu