»   »  ఫ్యాన్ పవర్ ‌: రెండు రోజుల్లో టీజర్‌కు 20 లక్షల హిట్స్‌

ఫ్యాన్ పవర్ ‌: రెండు రోజుల్లో టీజర్‌కు 20 లక్షల హిట్స్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ కొత్త చిత్రం 'ఫ్యాన్‌' టీజర్‌కు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. షారుఖ్‌ పుట్టిన రోజు సందర్భంగా నవంబర్‌ 1 అర్ధరాత్రి విడుదలైన ఈ టీజర్‌ను ఇప్పటి వరకు దాదాపు 20 లక్షల మంది వీక్షించారు.

అంతే కాకుండా దాదాపు 25 వేల లైక్స్‌ వచ్చాయి. ఈ చిత్రంలో షారుఖ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. 'ఫ్యాన్‌' గౌరవ్‌ పాత్రలో ఆయన ఎంతో వినూత్నంగా ఉన్నారని పలువురు అభినందన వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. టీజర్‌కి భారీ స్పందన రావడం పట్ల చిత్రం బృందం హర్షం వ్యక్తం చేసింది.

Shah Rukh Khan's 'Fan' teaser receives over 2 million views

షారుఖ్‌ ఖాన్‌ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం 'ఫ్యాన్‌'. షారుఖ్‌ 50వ పుట్టిన రోజు సందర్భంగా 'ఫ్యాన్‌' టీజర్‌ని చిత్ర బృందం ట్విట్టర్‌ ద్వారా విడుదల చేసింది. ఇక్కడ 'ఫ్యాన్‌' వీడియోని చూడండి.

మనీశ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఆదిత్య చోప్రా నిర్మాత. ఈ సినిమా ఏప్రిల్‌15న విడుదలకు సిద్దమవుతోంది.

English summary
Setting new records with each release, SRK's Fan teaser seems to have caught everyone's attention already. The teaser has already caused a stir on digital platforms and has raked in over 2 million views on YouTube in less than 2 days.
Please Wait while comments are loading...