హీరో డాన్స్ వీడియో...ఫేస్ బుక్ లో పెద్ద హిట్
ముంబై: 'దిల్‌వాలే' చిత్రంలో 'మన్మా ఎమోషన్స్ జాగే...' పాటకి యువ జంట వరుణ్ ధావన్, కృతి సనన్‌లతో పాటు షారుఖ్, కాజోల్ డాన్స్ చేశారు. ఈ వీడియోని షారుఖ్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు ఫేస్ బుక్ లో రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది.
Shaking a leg to Manma Emotion in UK! Dilwale
Posted by Shah Rukh Khan on 1 December 2015
విడుదలైన తొమ్మిది గంటల్లో దాదాపు 9 లక్షల మంది ఈ వీడియోని వీక్షించడం విశేషం. బాలీవుడ్ హిట్ జోడిగా పేరుపొందిన షారుఖ్, కాజోల్ జంటగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిందీ చిత్రం.
దిల్‌వాలే చిత్ర ప్రచారంలో భాగంగా యూకేలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో చిత్ర నటీనటులు షారుఖ్, కాజోల్, వరుణ్ ధావన్, కృతి సనన్‌లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేసిన 'మన్మా ఎమోషన్స్ జాగే' అనే పాటకి నృత్యం చేశారు. ఈ వీడియోని ఫేస్‌బుక్‌లో అభిమానులు విశేషంగా ఆదరిస్తున్నారు. దీనికి దాదాపు 90 వేల పైగా లైక్స్ కూడా రావడం మరో విశేషం. 'దిల్‌వాలే' చిత్రం డిసెంబర్ 18న విడుదలకు సిద్ధమవుతోంది.

బాలీవుడ్ తెరపై షారుక్‌ఖాన్, కాజోల్ సూపర్ హిట్ పెయిర్. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'దిల్ వాలే దుల్హనియా లేజాయెంగే' భారతీయ సినీ పరిశ్రమలోనే ఓ అద్బుతంగా నిలిచింది. ఏళ్ళ తరబడి ముంబైలోని మరాఠా మందిర్‌లో ప్రదర్శితమైంది ఈ మేటి చిత్రం. ఆ సినిమా టైటిల్‌లోని హాఫ్ పార్ట్‌ని కొత్త సినిమా టైటిల్‌గా ఎంచుకున్నాడు షారుక్. అదే 'దిల్ వాలే'.
యాక్షన్ ఎంటర్‌టైనరే అయినా అలనాటి 'డీడీఎల్‌జే'కి ఏమాత్రం తగ్గని రీతిలో రొమాంటిక్ అండ్ హార్ట్ టచ్చింగ్ సీన్స్ ఎన్నో ఈ 'డిడిఎల్‌జె'లో ఉంటాయని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











