»   » షారుక్ రైలు యాత్రలో అపశృతి, గుండెపోటుతో అభిమాని మృతి

షారుక్ రైలు యాత్రలో అపశృతి, గుండెపోటుతో అభిమాని మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాయిస్ చిత్రం కోసం బాలీవుడ్ బాద్షా చేపట్టిన రైలు యాత్రలో అపశృతి చోటుచేసుకొన్నది. వడోదర రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాటలో ఓ అభిమాని గుండెపోటుతో మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం విడుదలకు సిద్ధమైన రాయిస్ చిత్ర ప్రమోషన్ కోసం ఆగస్ట్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లో ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరాడు. రైలులో షారుక్ వస్తున్నాడనే సమాచారం బయటకు రావడంతో గుజరాత్ లోని వడోదర రైల్వే స్టేషన్ లో అభిమానులు పోటెత్తారు.

Shah Rukh Khan

షారుక్ చూసేందుకు వచ్చిన అభిమానుల్లో వడోదరకు చెందిన సామాజిక కార్యకర్త ఫరీద్ ఖాన్ పఠాన్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఫరీద్ ఖాన్ గుండెపోటుకు గురయ్యారు. వెంటనే సమీపంలోని దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అభిమాని ఫరీద్ మృతిపై తీవ్ర విచారాన్ని షారుక్ వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.

English summary
Shah Rukh Khan Fan dead with Cardiac arrest in Vadodara
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu