»   » సెక్స్ డిటర్మినేషన్ : వివాదంలో షారుక్

సెక్స్ డిటర్మినేషన్ : వివాదంలో షారుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu
ముంబై : బాలీవుడ్ స్టార్ కపుల్ షారుక్-గౌరీ ఖాన్ మూడో బిడ్డకు జన్మనివ్వబోతున్నారని, ఇందుకోసం సర్రోగెన్సీ పద్దతిని ఫాలో అయ్యారని, జులై నెలలో ఈ దంపతులకు మూడో బిడ్డ జన్మించే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. సర్రోగెన్సీ పద్దతి అనగా అద్దెగర్భం. షారుక్ వీర్యకణాలు, గౌరీ అండం ద్వారా పుట్టే బిడ్డను వేరొక మహిళ గర్భంలో పెంచడం అన్నమాట.

అయితే ఈ వార్తలపై షారుక్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ వార్త నిజం అని కానీ, కాదని కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. షారుక్ నుంచి ఎలాంటి ఖండన లేక పోవడంతో ఇది నిజమే అని అంతా నమ్ముతున్నారు. కాగా, షారుక్ ను ఇప్పుడు కొత్త వివాదం చుట్టుకుంది.

సర్రోగెన్సీ పద్దతి కాబట్టి...షారుక్-గౌరీ మూడో బిడ్డ విషయంలో సెక్స్ డిటర్మినేషన్(లింగ నిర్ధారణ) జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై విచారణ జరుపాలని, వారు ఈ పద్దతిలో బిడ్డను కనడానికి ఎలా అర్హులో కనుగొనాలని 'ఇండియన్ రేడియోజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్(IRIA) డిమాండ్ చేస్తోంది.

పుట్టబోయే లింగ నిర్ధారణ చేయడం భారతీయ చట్టాల ప్రకారం నేరం, బిడ్డపుట్టకముందే ఆడ, మగా అనే విషయాలు తెలుసుకుంటే శిక్షార్హులుకూడా. ఈ నేపథ్యంలో షారుక్-గౌరీ ఎలా స్పందిస్తారో? వారు సర్రోగెన్సీ పద్దతిలో మూడో బిడ్డను కనబోతున్నరన్న వార్తలో నిజం ఎంత? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే వీరికి 15 ఏళ్ల వయసున్న కుమారుడు ఆర్యన్, 13 ఏళ్ల వయసున్న కూతురు సుహానా ఉన్నారు.

English summary
After reports surfaced of a possible third child being on the way for Shah Rukh and Gauri Khan, the superstar is now in trouble over determining the sex of the baby. Sex determination and selection of a foetus are illegal in India and punishable offences by law.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu