మరుగుజ్జుగా షారుక్ మళ్లీ రిస్క్ చేస్తున్నాడా? టీజర్ అదిరింది..
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అభిమానుల్లో నిజంగా కొత్త సంవత్సరం జోష్ నింపారు. ఆనంద్ ఎల్ రాయ్ చిత్రానికి సంబంధించిన టైటిల్ ప్రకటనతోపాటు ట్రైలర్‌ను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకాను అందించారు. ఈ చిత్రంలో మరుగుజ్జు పాత్రలో నటిస్తున్న షారుక్ చిత్రం టైటిల్ ఇంతకీ ఏమిటనుకొంటున్నారా?

షారుక్ తదుపరి సినిమా పేరు జీరో
షారుక్ ఖాన్, ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా పేరు జీరో అని ప్రకటించారు. ఈ చిత్రంలో షారుక్ మరుగుజ్జుగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు.

టైటిల్‌తోపాటు టీజర్ రిలీజ్
నేను ఆనంద్ చెప్పిన ప్రకారం టైటిల్ జీరో ప్రకటనతోపాటు టీజర్‌ను విడుదల చేస్తున్నాం. ఈ చిత్రం షారుక్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ బ్యానర్‌పై రూపొందుతున్న సంగతి తెలిసిందే.

మరుగుజ్జుగా షారుక్
ఎప్పుడు ప్రేమకథలో అలరించిన షారుక్ ఖాన్ తొలిసారి ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో విచిత్ర సోదరులు సినిమాలో మాదిరిగా మరుగుజ్జుగా నటిస్తున్నారు. టీజర్‌లో పేర్కొన్న ప్రకారం వినోదాన్ని పంచే వ్యక్తిగా, ఎలాంటి బాదరబందీ లేని పాత్రలో కనిపించనున్నట్టు తేలిపోయింది.
జీరో దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్
విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్. గతంలో తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్, రాంజ్నా తదితర చిత్రాల్లో కనిపించారు.

షారుక్‌తో అనుష్క, కత్రినా కైఫ్
జీరో చిత్రంలో షారుక్ సరసన అనుష్క శర్మ, కత్రినా కైఫ్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో అనుష్క మానసికంగా పరిపక్వత చెందని పాత్రలో కనిపిస్తున్నట్టు సమాచారం. కత్రినా కైఫ్ సినీ నటి పాత్రను పోషిస్తున్నట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











