»   » బాగా సంపాదిస్తున్న హీరోల్లో ముగ్గురు మనోళ్లే..... (టాప్ 10 లిస్టు)

బాగా సంపాదిస్తున్న హీరోల్లో ముగ్గురు మనోళ్లే..... (టాప్ 10 లిస్టు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రపంచ ప్రఖ్యాత మేగజైన్ ఫోర్బ్స్ ప్రతి ఏడాది వివిధ రంగాల్లో బాగా సంపాదిస్తున్న సెలబ్రిటీల వివరాలు సేకరించి ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. అందులో సినిమా రంగానికి చెందిన వారి వివరాల కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు.

ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ప్రపంచ వ్యాప్తంగా బాగా సంపాదిస్తున్న యాక్టర్ల లిస్టును తాజాగా విడుదల చేసింది ఫోర్బ్స్ మేగజైన్. 2016 జూన్ 1 నుండి 2017 జూన్ 1 మధ్య కాలంలో వివరాలను బేస్ చేసుకుని ఈ లిస్టు రిలీజ్ చేశారు.

ఫోర్బ్స్ విడుదల చేసిన లిస్టులో టాప్ 10 లో మన ఇండియన్ స్టార్స్ ముగ్గురు ఉండటం గమనార్హం. మరి ఆ హీరోలు ఎవరు? ఎవరెవరు ఎంత సంపాదించారు? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం.

మార్క్ వాబర్గ్

మార్క్ వాబర్గ్

హాలీవుడ్ స్టార్ మార్క్ వాబర్గ్ 68 మిలియన్ డాలర్ల సంపాదనతో ఈ ఏడాది నెం.1 స్థానంలో నిలిచాడు. మన కరెన్సీ ప్రకారం అతడి సంపాదన ఏడాదికి రూ. 435 కోట్లు.

Highest Paid Actors In The World
డ్వేన్ జాన్సన్

డ్వేన్ జాన్సన్

హలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్ 65 మిలియన్ డాలర్ల సంపాదనతో రెండో స్థానంలో ఉన్నాడు. మన కరెన్సీ లెక్కల ప్రకారం అతడి సంపాదన రూ. 416 కోట్లు. ఇతగాడితో కలిసి మన ప్రియాంక చోప్రా బేవాచ్ అనే హాలీవుడ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

విన్ డీసెల్

విన్ డీసెల్

హాలీవుడ్ స్టార్ విన్ డీసెల్ 54.5 మిలియన్ డాలర్ల సంపాదనతో 3వ స్థానంలో ఉన్నాడు. మన కరెన్సీ ప్రకారం రూ. 349 కోట్లు. ఇతడిగా సినిమా ద్వారానే దీపిక పదుకోన్ హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చన సంగతి తెలిసిందే.

ఆడమ్ సాండ్లర్

ఆడమ్ సాండ్లర్

హాలీవుడ్ నటుడు ఆడమ్ సాండ్లర్ సంపాదన సంవత్సరానికి 50.5 మిలియన్ డాలర్లు. మన కరెన్సీ లెక్క ప్రకారం రూ. 323 కోట్లు.

జాకీ చాన్

జాకీ చాన్

అంతర్జాతీయ నటుడు జాకీ చాన్ సంపాదన సంపాదన సంవత్సరానికి 49 మిలియన్ డాలర్లు. మన కరెన్సీ లెక్క ప్రకారం రూ. 314 కోట్లు.

రాబర్ట్ డౌనీ జూనియర్

రాబర్ట్ డౌనీ జూనియర్

ఐరన్ మ్యాన్ స్టార్ రాబర్ట్ డౌనీ జూనియర్ ఈ ఏడాది సంపాదన 48 మిలియన్ డాలర్లు. మన కరెన్సీ లెక్క ప్రకారం రూ. 307 కోట్లు.

టామ్ క్రూయిజ్

టామ్ క్రూయిజ్

హాలీవుడ్ స్టార్ టామ్ క్రూయిజ్ సంపాదన 43 మిలియన్ డాలర్లు. మన కరెన్సీ లెక్క ప్రకారం రూ. 275 కోట్లు.

షారుక్ ఖాన్

షారుక్ ఖాన్

ఇండియన్ స్టార్ షారుక్ ఖాన్ 38 మిలియన్ డాలర్ల సంపాదనతో 8వ స్థానంలో ఉన్నారు. షారుక్ సంపాదన రూ. 243.5 కోట్లు.

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ 37 మిలియన్ డాలర్ల సంపాదనతో 9వ స్థానంలో ఉన్నారు. సల్మాన్ ఖాన్ సంపాదన రూ. 237 కోట్లు.

అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ 35.5 మిలియన్ డాలర్ల సంపాదనతో 10వ స్థానంలో ఉన్నారు. అక్షయ్ సంపాదన రూ. 227.5 కోట్ల రూపాయలు.

English summary
Like every year, the much awaited Forbes' list of highest paid actors in the world is out now, and the good news is that three Bollywood actors - Shah Rukh Khan, Salman Khan and Akshay Kumar - are in the list of top 10 highest paid actors.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu