»   » షాహీద్, కంగన, విశాల్ చావండి.. నరకానికి పోండి..

షాహీద్, కంగన, విశాల్ చావండి.. నరకానికి పోండి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

'షాహీద్, కంగన, విశాల్ మీరంతా చచ్చి నరకానికి పోండి' అంటూ నటుడు సైఫ్ అలీఖాన్ అభిమానులు మండిపడుతున్నారు. రంగూన్ దర్శకుడు, నటీనటులపై సైఫియాన్ పేరిట సోషల్ మీడియాలో పోస్ట్‌లతో దాడులు చేస్తున్నారు. అతిథి పాత్రలో కనిపించిన సైఫ్‌ను బలిపశువును చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రిలీజ్‌కు ముందు సూపర్.. తర్వాత అట్టర్ ఫ్లాప్

రిలీజ్‌కు ముందు సూపర్.. తర్వాత అట్టర్ ఫ్లాప్

విడుదలకు ముందు బ్రహ్మండమైన టాక్‌ను సొంతం చేసుకొన్న రంగూన్ చిత్రం దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకొన్నది. ప్రేక్షకుల నుంచి కనీస స్పందన కరువైనది. ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్ నటించిన రంగూన్ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో షాహీద్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రలు పోషించారు.

ప్రేక్షకుల నుంచి కనీస ఆదరణ కరువు

ప్రేక్షకుల నుంచి కనీస ఆదరణ కరువు

విడుదలైన ప్రతిచోట రంగూన్ చిత్రానికి ఆదరణ కరువైంది. భారీ తారాగణం, బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం గత నాలుగు రోజుల్లో కేవలం రూ.20 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో సైఫియాన్స్ మేనేజర్, సైఫియాన్స్ చైర్మన్ పేరిట ఉన్న అకౌంట్లలో విశాల్ భరద్వాజ్, కంగన, షాహీద్‌ను దుయ్యబడుతున్నారు.

దేశంలోనే షాహీద్ కపూర్ చెత్తనటుడు

దేశంలోనే షాహీద్ కపూర్ చెత్తనటుడు

‘దేశంలోనే అతి చెత్త నటుడు షాహీద్' అని, బాలీవుడ్‌లో ‘అత్యంత దురహంకార మహిళ కంగనా రనౌత్' అని పలు పోస్టులతో రఫాడిస్తున్నారు. షాహీద్, కంగనకు మరో దారుణమైన ఫ్లాప్. 20 నిమిషాల నిడివి ఉన్న సైఫ్ అతిథి పాత్ర సినిమాను కాపాడలేకపోయింది అని ట్వీట్ చేశారు.

 సైఫ్ సర్ ఇక అతిథి పాత్రలొద్దు

సైఫ్ సర్ ఇక అతిథి పాత్రలొద్దు

సైఫ్ సర్. మీరు ఇక అతిథి పాత్రలను అంగీకరించవద్దు. షహీద్ కెరీర్‌ను కాపాడటానికి సైఫ్ తన విలువైన 20 నిమిషాల సమయాన్ని వృధా చేసుకొన్నాడు. ఈ చిత్రంలో షాహీద్ ఓవరాక్షన్ ఎక్కువ అని.. జాతీయ ఉత్తమ నటులైన ఏ ఖాన్ కూడా ఆ చిత్రాన్ని కాపాడలేక పోయేవారని సైఫీయాన్స్ చైర్మన్ దుయ్యబట్టారు.

ఖాన్ల త్రయం నిరాశపరుచలేదు..

ఖాన్ల త్రయం నిరాశపరుచలేదు..

ఇటీవల సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ నటించిన దంగల్, రయీస్, శివయ్, సుల్తాన్, జాలీ2 చూశాం. వారు నిరాశపరుచలేదు. రంగూన్ మాత్రం చుక్కలు చూపించింది అని సైఫియాన్స్ మేనేజర్ అకౌంట్‌లో ట్వీట్ కనిపించింది.

English summary
Several tweets from Twitter users with names like 'Saifians Manager', 'Saifians Chairman' have tried elaborating their stand on the box-office disaster that is Rangoon. In twitter Saifians Manager, Saifians Chairman accounts furiously attacking the Rangoon stars. The most striking is 'Worst actor of the country (referring to Shahid Kapoor) and most arrogant lady of Bollywood (referring to Kangana)'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu