»   » సర్కార్ నోటీసులు? టెన్షన్లో షారుక్ ఖాన్‌, కాజోల్

సర్కార్ నోటీసులు? టెన్షన్లో షారుక్ ఖాన్‌, కాజోల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్లో షారుక్ ఖాన్, కాజోల్ జోడీ బాగా పాపులర్. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న చిత్రం ‘దిల్ వాలె' త్వరలో విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ ఇద్దరినీ ఇపుడు ఓ విషయం టెన్షన్ పెడుతోంది.

మహారాష్ట్ర ప్రభుత్వం నిషేదించిన గుట్కా యాడ్లలో నటించిన షారుక్ ఖాన్, అజయ్ దేవగన్‌లకు నోటీసులు ఇచ్చే ప్రయత్నంలో ఉంది అక్కడి సర్కారు. దీంతో షారుక్ తో పాటు, తన భర్త కూడా నోటీసులు అందుకుంటుండటంతో కాజోల్ కూడా టెన్షన్లో ఉందట. ఒక వేళ నోటీసులు అందితే తర్వాత ఏం చేయాలనే దానిపై ఇప్పటికే వీరూ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్.

Shahrukh Khan, Ajay Devgan to receive FDA notices over pan masala ads?

దిల్ వాలె చిత్రం వివరాల్లోకి వెళితే..
రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌పై గౌరీఖాన్‌, రోహిత్‌శెట్టి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో షారుక్, కాజోల్ తో పాటు యువ జంటగా వరుణ్‌ ధావన్‌, కృతి సనన్‌ నటిస్తున్నారు. ఇందులో కార్లను రీమోడలింగ్‌ చేసే వ్యక్తిగా షారుక్‌, ఆయన తమ్ముడిగా వరుణ్‌ కనిపించనున్నట్లు సమాచారం. ‘చెన్నై ఎక్స్ ప్రెస్‌' వంటి సూపర్‌హిట్‌ సినిమా తర్వాత షారుఖ్‌, రోహిత్‌శెట్టి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ చిత్రానికి ప్రీతమ్‌ సంగీతం సమకూర్చిన పాటలు దీపావళి సందర్భంగా నవంబర్‌ 11న సోనీ మ్యూజిక్‌ ద్వారా విడుదల చేస్తున్నారు. డిసెంబర్‌ 18న సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసారు.

English summary
In an attempt to curb the consumption of gutka, which is banned in Maharashtra, the Food and Drugs Administration (FDA) may soon send notices to superstars like Shah Rukh Khan and Ajay Devgan who have featured in advertisements for pan masala products.
Please Wait while comments are loading...