»   » నిజం ఇదే?: హీరోయిన్స్ తోనూ, ఫారినర్స్ తో , చివరకి మగాళ్ళతోనూ పడుకున్నాడా?

నిజం ఇదే?: హీరోయిన్స్ తోనూ, ఫారినర్స్ తో , చివరకి మగాళ్ళతోనూ పడుకున్నాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : సాధారణంగా సిటీల్లో తక్కువ గానీ పల్లెల్లో ..ఫలానా హీరో..ఫలానా హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడంటగా, ఆ హీరో ఎవరినీ వదలడు అంటగా ఇలా మాట్లాడుకోవటం మామూలే. అలాంటి ఆలోచనలు జనరేట్ కావటానికి మన మీడియా కూడా సాధ్యమైనంత హెల్ప్ చేస్తూంటుంది.

హీరోలు, హీరోయిన్స్ కూడా మనం గురించి ఎవరో ఒకరు ఏదో విధంగా మాట్లాడుకోవటం మంచిదే...అసలు ఏమీ పట్టించుకోకుండా ఉండటం కన్నా అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు. దాంతో స్టార్స్ కు రోజుకో ఎఫైర్ అంటగడతూ మన వెబ్ ప్రపచం హోరెత్తిపోతూంటుంది. కొందరు వాటిని నమ్ముతూ, తమకు తెలిసున్న సినిమావాళ్లను అడుగుతూ ఆనందపడుతూంటారు. మరికొందరు వాటిని లైట్ తీసుకుంటారు.

అయితే నిజంగా సినీ సెలబ్రెటీలకు కో స్టార్స్ తో ఎఫైర్స్ ఉండవా..ఇది నిజంగా పెద్ద సందేహమే. జనాలకు ఎంత డౌట్ అంటే..సినిమా వాడంటే చివరకు పిల్లను ఇవ్వటానికి ఇష్టపడనంత డౌట్. అవునా..కాదా..వాళ్ళు తాగుబోతులు, తిరుగుబోతులు, తమ సహ నటులతో ఎఫైర్స్ పెట్టుకుంటారు అంటూ ప్రచారం చేస్తూ, తాము నమ్ముతూ, అందరినీ నమ్మిస్తూంటారు.

ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కి అయితే చాలా మంది నటీమణులతో ఎఫైర్స్ అంటగట్టేసారు. అక్కడితో ఆగకుండా ఆయన మగవాళ్లతో కూడా తిరుగుతారు , ఎఫైర్ పెట్టుకుంటారు అని గాసిప్స్ ప్రచారం చేసేసారు. నిజానిజాలు ఏమిటి..ఈ విషయంలో ..నిజంగానే షారూఖ్ అలాంటివాడా అంటే షారూఖ్ మాటల్లోనే విందాం.

చాలా మంది అమ్మాయిలతో ...

చాలా మంది అమ్మాయిలతో ...

షారూఖ్ ఏమంటారంటే... , ''నేనో మూవీ స్టార్ ని, నేను గత ఇరవై సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ లో ఉన్నాను. నేను చాలా మంది అందమైన అమ్మాయిలతో పనిచేసాను. ప్రపంచ వ్యాప్తంగా నాకు అందమైన అమ్మాయిలు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నేను అలా వారి గురించి ఆలోచిస్తానా లేదా అనేది ప్రక్కన పెడితే నా మీద చాలా స్టోరీస్ అల్లేసారు.

ఫారినర్స్ తో మగాళ్లతో పడుకున్నానంటూ..

ఫారినర్స్ తో మగాళ్లతో పడుకున్నానంటూ..

నేను ..నా చుట్టూ ఉండే అమ్మాయిలతో పడుకున్నాననటమే కాదు, నాకు ఫారినర్స్ తో సంభందాలు ఉన్నాయని, నాకు మగాళ్లతో సంభందం ఉందని, నా తోటి ఆర్టిస్ట్ లతో రిలేషన్ పెట్టుకున్నానని, ఇలా బోల్డ్ రూమర్స్ నాపై వచ్చేసాయి. అవన్నీ తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది.

అయితే నా బార్య

అయితే నా బార్య

ఇవన్నీ నా భార్య గౌరి కూడా వింటూంటుంది. అయితే ఇవేమీ మా కుటంబం మీద ప్రభావం చూపలేదు. ఆవిడకు తెలుసు..నాకు అవన్నీ చేసేటంత టైమ్ లేదని, నేను ఖాళీగా ఉన్నప్పుడు నా కుటుంబంతోనే గడుపుతానని. అందుకే ఎలాంటి అనుమానాలు మా కాపురంలో పొడచూపలేదు.

టైం ఎక్కడ బాస్

టైం ఎక్కడ బాస్

వాళ్లు అనుకునేవి అన్నీ నిజమే అనుకుందాం. అవన్నీ చేయటానికి నాకు టైం ఎక్కడుంది. వరస సినిమాలు, కుటుంబం వీటితోనే సరిపోతోంది. అంతెందుకు నా ఫ్యామిలీతోనే నేను ఎక్కువ సేపు గడిపే పరిస్దితి లేదు. చాలా కాలం అయ్యింది..సరిగ్గా ఫ్యామిలీతో గడిపి. నా షెడ్యూల్స్ తో అలా అయిపోతోంది. అందుకే మా వైవాహిక జీవితం బోర్ కొట్టలేదు..ఫ్రెష్ గా ఇప్పటికీ ఉంది.

ఎవరి అభిప్రాయాలు వాళ్ళవే

ఎవరి అభిప్రాయాలు వాళ్ళవే

నిజానికి నేను మా భార్య...ఎప్పుడూ సినిమాలపై ఒకే అభిప్రాయం తో ఉండము. అలాగే జీవితం కూడా కూడా. ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. ఒకరి అభిప్రాయాలను మరొకరు మార్చాలని, మార్చుకోవాలని కానీ ప్రయత్నించం అన్నారు.

ఇద్దరం ఆ విషయంలోనే..

ఇద్దరం ఆ విషయంలోనే..

మేమిద్దరం ఒకే విషయంలో ఒకే రకరమైన ఆలోచనలు చేస్తాం. అది మా పిల్లల విషయంలో. మేమిద్దరం వాళ్లిద్దరి గురించి చాలా ఫోకస్ గా ఉంటాం. మా జీవితాలకి వాళ్లే కదా ఆలంబన అన్నారు కాస్త ఎమోషనల్ గా షారూఖ్.

పర్శనల్ ప్రేమ కథ

పర్శనల్ ప్రేమ కథ

షారూఖ్ ఖాన్ తెరపైనే కాదు నిజ జీవితంలోనూ లవబోయే. ఆయన తన 18 సంవత్సరంలోనే ఓకామన్ ప్రెండ్ పార్టీలో ఆమెను చూడటం ప్రేమలో పడటం జరిగింది. అది 1984 సంవత్సరం. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి జీవిత భాగస్వామిని చేసుకున్నాడు.

భార్య కాకముందు బోయ్ ఫ్రెండ్ తో

భార్య కాకముందు బోయ్ ఫ్రెండ్ తో

తనతో వివాహంకాకముందు గౌరీ.. ఓ కుర్రాడితో డాన్స్ చేయటం షారూఖ్ చూసారు. వెంటనే ధైర్యం తెచ్చుకుని ఆమెను నాతో డాన్స్ చేస్తావా అని అడిగాడు. గౌరి లేదు..నాకు బోయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతనికోసం వెయిట్ చేస్తున్నాను అని అబద్దం చెప్పింది.

పూర్తి స్దాయి ప్రేమలో

పూర్తి స్దాయి ప్రేమలో

ఆ తర్వాత ఆమెను కష్టపడి ప్రేమలో పడేయగలిగాడు షారూఖ్. ఏం చేసాడో ఏమో కానీ ఆమె షారూఖ్ తో పూర్తిగా ప్రేమలో మునిగిపోయింది. ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్దితికి వచ్చారు. అప్పుడు వీళ్లిద్దరూ పెళ్లి ప్రపోజల్ కు వెల్లారు.

మతం అడ్డుగా నిలిచింది

మతం అడ్డుగా నిలిచింది

సినిమాల్లో లాగానే నిజ జీవితంలోనూ షారూఖ్ ప్రేమ కు పెద్దల నుంచి అబ్యంతరాలు ఎదురయ్యాయి. షారూఖ్ ముస్లిం కావటం, ఆమె హిందూ కుటుంబానికి చెందినది కావటంతో పెద్దలు నో చెప్పారు.

సినిమాల్లో హీరో అవుతానంటే ఎవరు పిల్లనిస్తారు

సినిమాల్లో హీరో అవుతానంటే ఎవరు పిల్లనిస్తారు

ఈ విషయమై గౌరి ఖాన్ మాట్లాడుతూ... అవును అప్పట్లో మా పెద్దలు అభ్యంతరం చెప్పిన మాట నిజమే. మా మతం కాదు. అలాగే సినిమాల్లో చేరుతానంటున్నాడు. ఇద్దరమూ చిన్న వయస్సు వాళ్లమే. అందుకే మా పెద్దలు నిర్విర్దంగా నో చెప్పేసారు. అని అంది.

దాదాపు ఏడేళ్లకు

దాదాపు ఏడేళ్లకు

ప్రేమ మొదలైన ఏడేళ్లకు మొత్తానికి ఇరు వర్గాల కుటుంబాల వాళ్లను ఈ జంట ఒప్పించారు. అక్టోబర్ 25, 1991న హిందూ వివాహ సంప్రదాయ పద్దతిలో వీరి వివాహం జరిగింది. అలా వీరి ప్రేమ కథ పెళ్లిదాకా దారి తీసింది.

ఇప్పుడు షారూఖ్ ఏం చేస్తున్నాడంటే...

ఇప్పుడు షారూఖ్ ఏం చేస్తున్నాడంటే...

గౌరీ షిండే తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్ సినిమాకు సంబంధించి రీసెంట్ గా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. నార్మల్ మూడ్ లో సైకిల్ రైడ్ చేస్తూ ఉన్నట్టుగా అలియా, షారూఖ్ జంట సినిమాపై భారీ అంచనాలే పెంచింది. పోస్టర్ లో షారూఖ్ డిఫరెంట్ గెటప్ లో కనిపించి అలరిస్తున్నాడు. ఇక రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్ మెంట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా డియర్ జిందగీ టేక్ వన్ టీజర్ ని విడుదల చేసారు.

English summary
Shahrukh Khan is one of India's biggest superstars and often gets linked up with many actresses. And not just that the stories about him being gay also keep doing the rounds. Now for the first time, Shahrukh talked about the rumours of him sleeping with his co-stars, foreigners and men. The actor also revealed how his wife Gauri Khan reacts to this.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu