»   » ‘బ్రూస్ లీ’ సెట్లో షారుక్, చరణ్-ఉపాసన హ్యాపీ (ఫోటోస్)

‘బ్రూస్ లీ’ సెట్లో షారుక్, చరణ్-ఉపాసన హ్యాపీ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బ్రూస్ లీ-ది ఫైటర్' చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. టైటిల్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఈ సమయంలో ఉన్నట్టుండి సెట్స్‌కి వచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేసాడు బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్.

షారుక్ ఖాన్ ‘బ్రూస్ లీ' సెట్స్‌కి రావడం సూపర్బ్ సర్ ప్రైజ్, ఆయన్ను చూడగానే గర్ల్స్ అంతా క్రేజీగా మరారు అంటూ రామ్ చరణ్ తెలిపారు. అప్పటికే చిత్రీకరించిన బ్రూస్ లీ టైటిల్ సాంగుకు ఆయన చూసారు, చాలా బావుందని చెప్పారు అని రామ్ చరణ్ పేర్కొన్నారు. షారుక్ సెట్స్‌కు వచ్చిన సమయంలో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా అక్కడే ఉన్నారు. షారుక్ రాకపై ఆమె ఎంత సంతోషంగా ఉన్నారో ఇక్కడ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది.


Shahrukh khan‬ visits Brucelee-The Fighter‬ sets

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ' చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 16న విడుదలవుతోంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఆడియో ఇటీవలే హైదరాబాద్ లో అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే.


ఈ చిత్రాన్ని అమెరికాలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా విడుదల కానన్ని అత్యధిక స్క్రీన్లలో ‘బ్రూస్ లీ' సినిమా విడుదలవుతోంది. 220 స్క్రీన్లలో ‘బ్రూస్ లీ' చిత్రం విడుదలవుతోంది. రామ్ చరణ్ హీరోగా కావడం, శ్రీను వైట్ల దర్శకత్వం, మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ ఇలా సినిమాలో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నారు.


ఈ చిత్రాన్ని తమిళంలో ‘బ్రూస్ లీ-2' పేరుతో విడుదల చేస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా తమిళంలో ‘బ్రూస్ లీ' సినిమా ఆల్రెడీ సెట్స్ పై ఉండటంతో రామ్ చరణ్ నటిస్తున్న సినిమాకు ‘బ్రూస్ లీ-2' అని పేరు పెట్టారు. బ్రూస్ లీ -2 ఆడియో అక్టోబర్ 7న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని భద్రఖాళీ ఫిల్మ్స్ తమిళంలో విడుదల చేస్తోంది.


Shahrukh khan‬ visits Brucelee-The Fighter‬ sets

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఇప్పటికే రావాల్సినంత క్రేజ్ వచ్చేసింది. చిరంజీవి గెస్ట్ రోల్ లో కనిపించటం అనే వార్త, శ్రీను వైట్లతో తొలిసారి చేయటం, ఇప్పటికే వదిలిన ట్రైలర్స్ సినిమా బిజినెస్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయేలా చేసాయి. దాంతో ఈ చిత్రం అన్ని ఏరియాలు అమ్ముడయ్యి...పదికోట్లు టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.


రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌లతో పాటు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన నదియా, అరుణ్‌ విజయ్‌ నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
Superb surprise !! ‪#‎Shahrukhkhan‬!! on last day of ‪#‎BruceleeTheFighter‬ shoot.Girls on the sets went crazy.He saw parts of Brucelee title song and loved it !!
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu