»   » మందు బాబులు: ఆ ముగ్గురు హీరోలకు కోర్టు నోటీసులు

మందు బాబులు: ఆ ముగ్గురు హీరోలకు కోర్టు నోటీసులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోలైన షారుక్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, అజయ్ దేవగన్, సునీల్ శెట్టి మరియు మనోజ్ భాజ్‌పాయ్‌లకు కోర్టు నుండి నోటీసులు జారీ అయ్యాయి. మధ్యప్రదేశ్‌లో లిక్కర్ (సారాయి) అమ్మకాలను ప్రోత్సహిస్తూ వీరి పోస్టర్లు వెలవడంతో కోర్టు నుండి ఈ నోటీసులు జారీ అయ్యాయి.

మధ్య ప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలు వీరిపై రావడంతో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియార్ హైకోర్టు బెంచ్ ఈ సినిమా స్టార్లకు నోటీసులు జారీ చేసింది. న్యాయవాది అవద్వేష్ భడోరియా వేసిన పిటీషన్ విచారించిన కోర్టు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. పోలీసులు ఈ సినిమా యాక్టర్లపై కేసు నమోదు చేయడం లేదని ఆయన ఆరోపించారు.

Shahrukh, Saif, Ajay Devgn Sunil Shetty: Court Notice Issued

ఈ ముగ్గురు యాక్టర్లతో పాటు మూడు డిస్ట్రిల్లర్లకు, గ్వాలియర్ ఎస్పీకి, ఇందెర్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్స్‌స్పెక్టర్‌కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటులతో పాటు, డిస్ట్రిల్లర్లు ఈ కేసులో తమ వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

జనవరి 22, 2011 ఎక్సైజ్ చట్టాల ప్రకారం... ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో లిక్కర్ ప్రకటనలు, హోర్డింగులు, అందుకు సంబంధించిన ఇతర ప్రకటనలు, సోడా ప్రకటనలపై నిషేదం విధించారు. అయితే ఆ నిషేదాన్ని ఉల్లంగిస్తూ సదరు హీరోలు లిక్కర్ బ్రాండ్ యాడ్లలో దర్శనమివ్వడం చర్చనీయాంశం అయింది.

English summary
Shahrukh Khan, Saif Ali Khan, Ajay Devgn, Sunil Shetty and Manoj Bajpai have all been served a court notice for promoting liquor in Madhya pradesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu