»   » ఆ ఇష్య్యూ తర్వాత కూడా... పవన్ కళ్యాణ్ దేవుడే అంటున్నాడు!

ఆ ఇష్య్యూ తర్వాత కూడా... పవన్ కళ్యాణ్ దేవుడే అంటున్నాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జబర్దస్త్‌తో ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకొన్న శకలక శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. పవన్ కళ్యాణ్ ను ఆరాదిస్తూ ఆ షోలో పలు షోలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నా దేవుడు అంటూ అనేక సందర్భాల్లో ప్రకటనలు చేసిన శంకర్...ఆయన కోసం గుడి కూడా కడుతున్నట్లు ప్రకటించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శంకర్ మరోసారి పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ నా దేవుడు అని చెప్పుకొచ్చారు. ఎక్స్ ప్రెస్ రాజా, రన్ రాజా రన్ చిత్రాల్లో నా పెర్ఫార్మెన్స్ ను పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారని తెలిపారు. తాను గతంలో చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉంటానని, పవన్ కళ్యాణ్ కోసం గుడి కట్టి తీరుతానని తెలిపారు.

పవన్ కళ్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాలో శంకర్ కూడా అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే షూటింగులో పవన్ కళ్యాణ్ అతన్ని ఓవరాక్షన్, క్రమశిక్షణ రాహిత్యాన్ని భరించలేక చెంపదెబ్బ కొట్టారనే రూమర్స్ వచ్చాయి. ఆ వివాదం తర్వాత కొంతకాలం శంకర్ ఎవరికీ కనిపించలేదు. సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకకు కూడా హాజరు కాలేదు. ఈ సంఘటన తర్వాత పవన్ మీద అతనికి భక్తి భావం తగ్గిందని అంతా భావించారు. అయితే అలాంటిదేమీ లేదని....పవన్ కళ్యాణ్ తనకు ఎప్పుడూ దేవుడే, నేను ఆయనకు భక్తుడినే అని శంకర్ తేల్చి చెప్పారు.

Also Read: రహస్యంగా జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ పెళ్లి! (ఫోటోస్)

Shakalaka Shankar will build a temple for Pawan Kalyan

చెంప దెబ్బ వివాదం...
ఏకంగా పవర్ స్టార్ లాంటి పెద్ద హీరో సినిమాలో ఛాన్స్ రావటంతో...శంకర్ కు గోరోజనం బాగా పెరిగిపోయిందని రూమర్లు వచ్చాయి. సెట్ కు సమయానికి రాకుండా..ఇబ్బందికి గురి చేస్తున్నాడని, డైరెక్టర్ పై కుళ్లు జోకులు వేసారని దీంతో పవన్ చేత చెంపదెబ్బలు చిన్నారన్న వార్తలు వచ్చాయి. దీనిపై శకలక శంకర్ క్లారిటీ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ హెచ్చరించిన వార్తలు నిజమేనన్నారు. కాని చెంపదెబ్బ కొట్టారన్నది వాస్తవం కాదన్నారు. ఇదే విషయాన్ని శంకర్ మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్ నాకు దేవుడు లాంటి వారన్నారు. కళ్యాణ్ గారు సెట్ లో నాతో చాల సరదాగా ఉంటారన్న ఆయన...నాతో పాటలు పాడించుకుని ఆనందిస్తారని గుర్తుచేశారు. అయితే గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తల్లో వాస్తము లేదన్నారు. నన్ను పవన్ హెచ్చిరించిన వార్త నిజమే కాని..నన్ను చెంపదెబ్బకొట్టారన్నది వాస్తవం కాదన్నారు. నేను ఏదైనా సీన్ సరిగ్గా చేయకపోతే ఇలా చేయాలి. అలా చేయాలని చెప్పేవారన్నారు.

English summary
The upcoming comedian Shakalaka Shankar said in a recent interview that he considers Pawan Kalyan his god and that Pawan even appreciated his performance in films like Express Raja and Run Raja Run. Incidentally, Shankar got an opportunity to share the screen space with his favorite star in Sardaar Gabbar Singh. It is well known that Shankar had long back stated that he will build a temple for Pawan Kalyan at his hometown.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu