»   » పెద్ద హీరోలు భయ పడేంత సీన్ లేదు: షకీలా

పెద్ద హీరోలు భయ పడేంత సీన్ లేదు: షకీలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు సౌతిండియాలో షకీలా పేరు వింటే చాలు సినీ ఇండస్ట్రీలు షేకయ్యేవి. ఆమె సినిమా విడుదలవుతుందంటే థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిసేది. షకీల సినిమా విడుదలవుతుందటే పెద్ద హీరోల సినిమాలు సైతం విడుదల చేసేందుకు భయ పడేవారు అనే ప్రచారం కూడా ఉంది.

Read Also: షకీలా ఆత్మ కథలో కొన్ని చేదు నిజాలు...

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షకీల ఈ విషయమై స్పందిస్తూ..... ‘అప్పట్లో నేను చేసేవి చిన్న సినిమాలు కాబట్టి ప్రతి వారం ఒకటి రిలీజ్ అయ్యేది. కానీ పెద్ద హీరోల సినిమాలు సంవత్సరానికి 2 లేదా 3 రిలీజ్ అయ్యేవి. దాని వల్ల వాళ్ల సినిమాలు లేటుగా వచ్చేవి. అంతే కానీ నా సినిమాలకు పెద్ద హీరోలు భయడేంత సీన్ లేదు' అని స్పష్టం చేసారు షకీలా.

Read Also: వర్జిన్‌వా అంటే తెలీదని చెప్పా: షకీలా

Shakeela's 23 films censor did not approved

తన సినిమాలకు చాలా సెన్సార్ సమస్యలు వచ్చే. దాదాపు 23 సినిమాలు సెన్సార్ సమస్య వల్ల రిలీజ్ కాలేదు. సెన్సార్ సమస్య వచ్చి సినిమా రిలీజ్ కాకపోతే నిర్మాత నష్టపోవాల్సి వచ్చేది. వరుసగా అలాంటి సమస్యలు రావడంతో నేనే కావాలని ఆ సినిమాలు చేయడం మానేసాను అని తెలిపారు.

అలాంటి... సినిమాల్లో నటిస్తున్నపుడు మీ పరిస్థితి ఎలా ఉండే? బయటకు వచ్చినపుడు జనాల నుండి ఎలాంటి స్పందన వచ్చేది అనే ప్రశ్నకు షకీలా స్పందిస్తూ.... నేను అసలు బయటకు వచ్చేదాన్ని కాదు, ఒక వేళ వచ్చినా ఎవరూ గుర్తు పట్టకుండా బురఖా వేసుకుని వచ్చేదాన్ని అని షకీలా తెలిపారు.

English summary
Actress Shakeela said that the Censor Board did not give approval for 23 films in which she played main roles. She stated that she quit acting softcore porn movies as producers unable to get clearance for their movies from the Censor Board because of her.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu