»   »  పవన్ కళ్యాణ్‌తో మళ్లీ నష్టపోకూడదనే, అక్కడ నుండి ఆఫీస్ ఎత్తేస్తాడా?

పవన్ కళ్యాణ్‌తో మళ్లీ నష్టపోకూడదనే, అక్కడ నుండి ఆఫీస్ ఎత్తేస్తాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అత్తారింటికి దారేది సినిమా విషయంలో నిర్మాతతో రెమ్యూనరేషన్ విషయంలో తేడా రావడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా అప్ సెట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన తన స్నేహితుడు శరత్ మరార్ తోనే వరుస సినిమాలు చేస్తున్నారు.

గోపాల గోపాల సినిమాతో పాటు తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు కూడా నిర్మాత ఆయనే. అయితే ఈ రెండు సినిమాలతో శరత్ మరార్ కు పెద్దగా ఒరిగిందేమీ లేదు. గోపాల గోపాల సినిమాకు యావరేజ్ కలెక్షన్లు రాగా, సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ ఆయనకు నష్టాలే మిగిల్చింది.

తన సినిమాల వల్ల నష్టపోయిన తన స్నేహితుడిని నష్టాల నుండి గట్టెక్కించేందుకు పవన్ కళ్యాణ్ ఆయనతో మరో సినిమా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, శరత్ మరార్ ఇద్దరు సినిమాలపై ఫ్యాషన్ ఉన్న వ్యక్తులే. ఎందుకనో ఈ ఇద్దరికి కలిసి రావడం లేదు.

తాము తీస్తున్న సినిమాలకు ఎందుకు లక్కు కలిసి రావడం లేదు? అనే సందేహం శరత్ మరార్ లోనూ వచ్చిందట. పలువురు ఆస్ట్రాలజిస్టులను సంప్రదిస్తే ప్రస్తుతం ఉన్న ఆఫీసు వాస్తు బాగోలేదని, మారిస్తే మంచిదని చెప్పారట. దీంతో శరత్ మరార్ వారి సూచనల మేరకు ఆఫీసును వేరే చోటుకు మార్చాలనే ఆలోచనలో ఉన్నారట.

ఆల్రెడీ సినిమా ఇప్పటికే మొదలైనా అనుకోని ఆటు పోట్లు ఎదురయ్యాయి. అందుకే శరత్ మరార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన పూర్తి వివరాలు..

పవన్-శరత్ మరార్

పవన్-శరత్ మరార్


పవన్ కళ్యాణ్-శరత్ మరార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడో చిత్రమిది. ఎస్.జె.సూర్య దర్శకుడిగా మొదలైన ఈ సినిమాకు అనుకోని ఆటు పోట్లు ఎదురయ్యాయి.

దీనికి కూడా దర్శకుడు మరాడు

దీనికి కూడా దర్శకుడు మరాడు


గత చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ సంపత్ నందితో మొదలై చివరకు బాబీ దర్శకత్వంలో షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. చివరకు చూస్తే సినిమా డిజాస్టర్. ఇపుడు ఎస్.జె.సూర్య కూడా అనుకోని కారణాలతో సినిమా నుండి మధ్యలో తప్పుకోవడంతో శరత్ మారార్ లో ఏదో తెలియని ఆందోళన మొదలైంది.

డాలిని రంగంలోకి..

డాలిని రంగంలోకి..


ఎస్.జె.సూర్య తప్పుకోవడంతో పవన్ కళ్యాణ్ గతంలో తాను ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఈ సినిమాకు దర్వకత్వం వహించే బాధ్యతను డాలీకి అప్పగించారు. గతంలో డాలి దర్శకత్వం లో వచ్చిన గోపాల గోపాల్ చిత్రం యావరేజ్ ఫలితాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే.

సినిమా ఆలస్యం

సినిమా ఆలస్యం


ప్రస్తుతం డాలీ తన విజన్ కు అనుగుణంగా స్క్రిప్టులో కొన్ని మార్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

English summary
Although Gopala Gopala was an average grosser, Sardaar has bitten dust at the box office. With this Sharath decided to shift his office as he felt that the old office hasn’t been lucky for him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu