»   » 'సర్దార్' నిర్మాత ట్వీట్...సింగపూర్ ఎఫెక్టా?

'సర్దార్' నిర్మాత ట్వీట్...సింగపూర్ ఎఫెక్టా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'సర్దార్‌ గబ్బర్ సింగ్'. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షెడ్యూల్ గురించి నిర్మాత శరద్ మరార్ ట్వీట్ చేసారు. ఈ నెలాఖరు వరకూ కంటిన్యూ షెడ్యూలు షూటింగ్ జరుగుతుందని, సమ్మర్ మొదట్లో విడుదల చేస్తారమని అన్నారు.


హఠాత్తుగ ఈ ట్వీట్ చేయటానికి కారణం..మీడియాలో పవన్ కళ్యాణ్ ..సింగపూర్ కు వెళ్తున్నారనే వార్తే అని కొందరంటున్నారు. పవన్ ..సింగపూర్ వెళ్తున్నారనే వార్త మీడియాలో ప్రముఖంగా రావటంతో ...సినిమా గురించి డైవర్షన్ వస్తుందని ఇలా ట్వీట్ చేసారని చెప్తున్నారు.


రీసెంట్ గా సంక్రాంతి సందర్భంగా విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోస్ వారు ఈ చిత్రాన్ని 70 కోట్లకు అవుట్ రేటు కు తీసుకున్నట్లు తెలుస్తోంది.


 Sharrath Marar about Sardaar Gabbar Singh Shedule

పవన్‌ కల్యాణ్‌ ఖాకీ కడితే ఆ ప్రభంజనం ఎలా ఉంటుందో 'గబ్బర్‌ సింగ్‌'లో చూశాం. 'నాక్కొంచెం తిక్కుంది. దానికో లెక్కుంది' అంటూ డైలాగులనే బులెట్లులా పేల్చారు అందులో. ఇప్పుడు మళ్లీ పవన్‌ కల్యాణ్‌ పోలీస్‌ అవతారం ఎత్తాడు. మరోసారి లాఠీ పట్టి హంగామా చేయబోతున్నాడు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా శరత్‌ మరార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


క్రిందటి నెలాఖరున మొదలయిన కొత్త షెడ్యూలుతో పవన్‌ కల్యాణ్‌ రంగ ప్రవేశం చేసారు, ఆయనపైకీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కించారని తెలుస్తోంది. ఇక నుంచి ఏకధాటిగా ఈ సినిమాని పూర్తి చేయాలని పవన్‌ భావిస్తున్నారట. హీరోయిన్ గా కాజల్ ని నిర్ణయించినట్లు సమాచారం.


నిర్మాత మాట్లాడుతూ ''ఈ సినిమా 'గబ్బర్‌సింగ్‌'కు సీక్వెలో ప్రీక్వెలో కాదు. ఇదో కొత్త కథ. పవన్‌ చిత్ర కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకొన్నారు. సినిమాలోని భావోద్వేగాన్ని ప్రతిఫలించేలా టీజర్ ను రూపొందించాం. దేవిశ్రీప్రసాద్‌ అందించిన బాణీలు ఆకర్షణగా నిలుస్తాయి''అన్నారు.


బాబి దర్శకతం వహిస్తున్న ఈ చిత్రానికి శరత్‌మరార్‌ నిర్మాత. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, పోరాటాలు: రామ్‌ లక్ష్మణ్‌.English summary
Sharrath Marar ‏ tweeted:" SardaarGabbarSingh Hyderabad schedule fast progressing and to continue till the end of the month. #PSPK keen on an early summer release.".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu