»   » ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గురించి నిర్మాత ఆసక్తికర ట్వీట్!

‘సర్దార్ గబ్బర్ సింగ్’ గురించి నిర్మాత ఆసక్తికర ట్వీట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.... పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధిచిన... నిర్మాత శరత్ మారార్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్ సెట్స్ లో ఈరోజు వర్క్ చాలా గొప్పగా ముగిసింది. పవన్ కళ్యాణ్ చాలా గొప్పగా చేసారు. ఇలాంటి ప్రాజెక్టులో నేనూ భాగం కావడం ఓ వరంలా భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ హార్డ్ వర్క్ కళ్ళారా చూసాను. అభిమానులకు ఏ కావాలో ఆయనకు భాగా తెలుసు. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని కంప్లీట్ ఎంటర్టెనర్ గా తయారు చేస్తున్నారు' అని ట్వీట్ చేసారు.

పవనకల్యాణ్‌ సరసన కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. పవనకల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైనమెంట్‌ ప్రై.లి, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏ సినిమా బిజినెస్ అయినా కనీసం రిలీజ్ కు ముందు ఒక నెల నుండే ప్రారంబిస్తారు. కాని పవన్ కళ్యాణ్ సినిమాకు మాత్రం సినిమా ప్రారంభం నుంచీ బిజినెస్ కోసం ట్రేడ్ వర్గాల్లో హడావిడి ప్రారంభమవుతుంది.

Sharrath Marar tweet about Pawan Kalyan hard work

ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ కు అలాంటి పరిస్దితే ఉంది. ఈ సినిమా కోసం బయ్యర్లు వెంట పడుతున్నారు. కాని మొదటే ఈ సినిమా బిజినెస్ చేయకుండా క్రేజ్ వచ్చేదాకా ఆగారు. అయితే ఇటీవల..బిజినెస్ ప్రారంభించాలని నిర్ణయించుకోవాలని నిర్మాత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రిలీజ్ డేట్ ని లాక్ చేసి ట్రేడ్ వర్గాలకు తెలియచేసినట్లు తెలుస్తోంది. గాయత్రి ఫిల్మ్ వారు, ఉత్తరాంధ్ర కు సంబందించిన రైట్స్ ని ఇప్పటికే చాలా పెద్ద మొత్తం వెచ్చించి తీసుకున్నట్లు సమచారం.

ఏప్రిల్ 8, 2016లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారం. సమ్మర్ ట్రీట్ గా ఈ చిత్రం అలరించనుందని,అప్పుడైతే వేసవి శెలవలు కలిసి వస్తాయని టీమ్ భావిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రాయ్ లక్ష్మీ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రతో పాటు స్పెషల్ సాంగుతో ప్రేక్షకులను అలరించనుంది

English summary
"Just finished a great day of work on d sets of Sardaar Gabbar Singh. Pawan Kalyan was at his best. Feel blessed to be a part of this project. All his hard work is unfolding now. Pawan Kalyan knows so well what his fans want & he is making sure that #SGS is a complete entertainer." Sharrath Marar tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu