»   » ఇంతకంటే గొప్ప ప్రారంభం ఉండదు: ‘హలో’ ఫేం కళ్యాణి ప్రియదర్శన్

ఇంతకంటే గొప్ప ప్రారంభం ఉండదు: ‘హలో’ ఫేం కళ్యాణి ప్రియదర్శన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'హలో' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన కళ్యాణి ప్రియదర్శన్ తన రెండో చిత్రం షూటింగులో జాయినైంది. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మూవీ షూటింగ్ వైజాగ్‌లో ప్రారంభం అయింది. సితార ఎంటర్టెన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. సెట్స్‌లో జాయినైన సందర్భంగా కళ్యాణి ట్విట్టర్ ద్వారా చిత్ర బృందంతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

'ఈ సంవత్సరం ఎంతో గొప్పగా ప్రారంభం అయింది. ఇంక్రెడబుల్ టీమ్‌తో ఫస్ట్ డే షూటింగ్. ఇదే నా బెస్ట్ బర్త్ డే గిఫ్ట్. నన్ను విష్ చేసిన అందరికీ థాంక్స్. మీ అందరి ఆశీర్వాదం ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను.' అని కళ్యాణి ప్రియదర్శన్ వ్యాఖ్యానించారు.

'హలో' సినిమా ద్వారా తెరంగ్రేటం చేసిన కళ్యాణికి తొలి చిత్రంతోనే మంచి పేరొచ్చింది. అటు అందం పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా మంచి మార్కులు పడటంతో వెంటనే శర్వానంద్ సినిమాలో అవకాశం వచ్చింది. మరిన్ని సినిమాలు లైన్లో ఉన్నాయి. అయితే ఇంకా అఫీషియల్‌గా సైన్ చేయలేదు.

ప్రముఖ సౌతిండియా దర్శకుడు ప్రియదర్శన్, నటి లీజీ కూతురైన కళ్యాణి సినిమా రంగంపై ఇష్టంతో ఇటు వైపు అడుగులు వేశారు. 2013లో ఆమె క్రిష్3 సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేశారు, 2016లో వచ్చిన ఇరుముగన్ అనే చిత్రాని అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. 2017లో అఖిల్ అక్కినేని మూవీ 'హలో' ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయ్యారు.

English summary
Actor Kalyani Priyadarshan has started shooting for her second film, in Telugu again, which is alongside Sharwanand. The film is yet to be titled and is being directed by Sudheer K Varma. “Couldn’t have started this year off any better way! First day of shoot with an incredible team. Best birthday gift ever! Thanks to everyone for the kind wishes. Need all your best wishes for the coming year SitharaEnts sudheerkvarma.” Kalyani tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X