ఫెయిల్యూర్స్ వచ్చినా శర్వానంద్ రేంజ్ తగ్గట్లేదుగా.. మళ్ళీ పవర్ఫుల్ పాత్రలో
టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్టు కోసం పరితపిస్తున్న హీరోల్లో శర్వానంద్ ఒకరు. అతను చేస్తున్న కొన్ని సినిమాలు గత కొంతకాలంగా వరుసగా ప్లాప్ అవుతున్నాయి. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా లాభాలు అందుకోవడం లేదు. 2017లో మహానుభావుడు హిట్టు అనంతరం శర్వానంద్ నాలుగు విభిన్నమైన సినిమాలు చేశాడు.
పడి పడి లేచే మనసు, రణరంగం, జాను, శ్రీకారం వంటి సినిమాలు విడుదలకు ముందు మంచి హైప్ క్రియేట్ చేసినప్పటికీ ఆ తరువాత ఊహించని విధంగా ప్లాప్ అయ్యాయి. ఇక ఎలాగైనా నెక్స్ట్ సినిమాలతో మంచి హిట్స్ అందుకోవాలని శర్వానంద్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇప్పటికే తెలుగు తమిళ్ లో ఒక ద్విభాషా సినిమాతో బిజీగా ఉన్న శర్వానంద్ ఆర్ఎక్స్ 100 దర్శకుడితో మహాసముద్రం అనే సినిమాను కూడా స్టార్ట్ చేశాడు.

ఇక కిషోర్ తిరుమలతో కూడా ఆడళ్లు మీకు జోహార్లు అనే సినిమా చేయనున్న శర్వానంద్ ఇటీవల మరో కొత్త సినిమాకు కూడా గ్రీన్ ఇచ్చినట్లు సమాచారం. అందులో పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే రాధ అనే సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించిన శర్వానంద్ ఈసారి అంతకు మించి అనేలా కిక్కివ్వబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విభిన్నమైన సినిమాలతో అయినా శర్వానంద్ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











