»   » హృద్యమైన ప్రేమ కథ ('మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' ప్రివ్యూ)

హృద్యమైన ప్రేమ కథ ('మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తొలి నాటి నుంచి విభిన్న తరహా కథాంశాలకు పెద్ద పీట వేస్తూ వస్తున్న శర్వానంద్ హిట్ మాత్రం అరుదుగా పలకరిస్తోంది. అయితే రీసెంట్ గా కమర్షియల్ యాంగిల్ లో ట్రై చేసిన రన్ రానా రాజా చిత్రం హిట్ కావటంతో ఈ రోజు విడుదల అవుతున్న ఈ చిత్రానికి ఓపినింగ్స్ వస్తాయని భావిస్తున్నారు. ముఖ్యంగా ఫీల్ గుడ్ చిత్రం కావటంతో మల్టిఫ్లెక్స్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ప్రేమకు కుల, మతాలు అడ్డుకావనే నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్‌ క్రీడాకారుడిగా కనిపిస్తారు. నిత్యామీనన్ అతను ప్రేమించిన యువతిగా కనిపించనుంది. విధికి తలొగ్గి తమ ప్రేమను సాఫల్యం చేసుకోలేకపోయిన ఓ జంట ఇరవైయేళ్ల తర్వాత కలుసుకుంటారు. అప్పుడు వారి భావోద్వేగాలు ఎలా వుంటాయి? జీవన గమనంలో వారి దృక్పథాల్లో వచ్చిన మార్పులేమిటి? వారు కలుసుకోవడానికి దారితీసిన పరిస్థితులేమిటి? వారి బంధం చివరకు ఏ తీరాలకు చేరింది? ఈ ప్రశ్నలన్నింటికీ అందమైన దృశ్యరూపమే చిత్ర కథ.


Sharwanand’s ‘Malli Malli Idi Rani Roju’ preview

చిత్ర నిర్మాత కె.ఎ.వల్లభ మాట్లాడుతూ ‘‘మా సంస్థలో వస్తున్న మరో బ్యూటీఫుల్‌ లవ్‌స్టోరీ. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ప్రేమ గొప్పతనాన్ని తెలిపే సినిమా అవుతుంది. నిత్యామీనన్‌, శర్వానంద్‌ పోటీపడి నటించారు. క్రాంతి మాధవ్‌ అద్భుతంగా తెరకెక్కించారు. గోపీసుందర్‌ సమకూర్చిన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. థియేట్రికల్‌ ట్రైలర్స్‌కి, సంభాషణలకి మంచి స్పందన వస్తోంది.'' అని తెలిపారు.


చిత్ర సమర్పకుడు కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ ''ప్రతి వారం బాక్సాఫీసు ముందుకు ఓ ప్రేమకథ వస్తోంది. అయితే వాటి మధ్య 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇదో విభిన్నమైన ప్రేమకథా చిత్రం. దర్శకుడు క్రాంతిమాధవ్‌ కథ చెబుతున్నప్పుడు చాలా ఉద్వేగానికి లోనయ్యాను. శర్వా, నిత్యల కాంబినేషన్‌ మరోసారి ఆకట్టుకొంటుంది. మా సంస్థలో ఓ మంచి చిత్రంగా నిలిచిపోతుందన్న నమ్మకం ఉంది. గోపీసుందర్‌ అందించిన బాణీలు ఇప్పటికే శ్రోతలను అలరిస్తున్నాయి. వాటిని తెరపై తీర్చిదిద్దిన విధానం కూడా బాగుంటుంది. విశాఖ అందాల మధ్య ఆవిష్కరించిన ఓ అందమైన ప్రేమకావ్యంగా ఈ చిత్రం నిలిచిపోతుంది''అన్నారు.


Sharwanand’s ‘Malli Malli Idi Rani Roju’ preview

దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ.... చిరంజీవి నటించిన రాక్షసుడు చిత్రంలోని మళ్లి మళ్లీ ఇది రాని రోజు గీతం ఎంతటి ప్రజాదరణ పొందినదో అందరికీ తెలిసిందే. ఆ పాటలోని పల్లవిని టైటిల్‌గా పెట్టుకోవడం ఆనందంగా వుంది. పరిణితి చెందిన ప్రేమకథా చిత్రమిది. హృదయాల్ని మెలిపెట్టే భావోద్వేగభరిత సన్నివేశాలుంటాయి. సాయిమాధవ్ బుర్రా రాసిన సంభాషణలు మనసును కదిలించేలా వుంటాయి. శర్వానంద్ ఈ చిత్రంలో క్రీడాకారుడిగా కనిపిస్తారు. నిత్యామీనన్ పాత్రలో రెండు భిన్న పార్శాలుంటాయి అన్నారు.


బ్యానర్: సి.సి.మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌
నటీనటులు :శర్వానంద్, నిత్యా మీనన్, నాజర్‌, తనికెళ్ళ భరణి, ఆహుతి ప్రసాద్‌, తేజస్వి తదితరులు
సంగీతం: గోపీసుందర్‌,
కెమెరా: జ్ఞానశేఖర్‌ వి.యస్‌.,
మాటలు: సాయిమాధవ్‌ బుర్రా,
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు.
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం క్రాంతి మాధవ్
నిర్మాత: కె వల్లభ
సమర్పణ : కె.యస్‌.రామారావు
విడుదల తేదీ: 06,ఫిబ్రవరి 2015

English summary
Sharwanand is now coming up with ‘Malli Malli Idi Rani Roju’, a romantic entertainer that also stars Nitya Menen releasing today.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu