»   » "శతమానంభవతి" ఫుల్ రన్ కలెక్షన్స్...అంతా షాక్, ఎవరూ ఊహించలేదు ఇది

"శతమానంభవతి" ఫుల్ రన్ కలెక్షన్స్...అంతా షాక్, ఎవరూ ఊహించలేదు ఇది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణల చిత్రాలతో పోటీపడిన చిత్రం "శతమానంభవతి". శర్వానందం నటించిన ఈ చిత్రంలో శర్వానంద్ హీరో. సతీష్ వేగ్నేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శర్వానంద్ సరసన అనుపమపరమేశ్వరన్ జతకట్టింది.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఊహించని విధంగా ఘన విజయం సాధించింది. టోటల్ కలెక్షన్స్ వివరాలు ఇక్కడ చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. చిన్న సినిమా ఇంత పెద్ద హిట్టా అంటారు.

ట్రేడ్ పండితుల అంచనాలకు అందని రీతిలో ఏకంగా రూ.33.3 కోట్ల షేర్.. రూ.53.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తెలుగు రాష్ట్రాల వరకే ఈ సినిమా రూ.29.6 కోట్ల షేర్.. రూ.43.9 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. పెట్టుబడి మీద ఈ చిత్రం దాదాపు మూడు రెట్ల షేర్ రాబట్టడం మరో విశేషం.

Sharwanand's Sathamanam Bhavathi Movie final Collections!!

ఫుల్ రన్లో ఏరియాల వారీగా 'శతమానం భవతి' వరల్డ్ వైడ్ షేర్స్ వివరాలు..

నైజాం-రూ.11 కోట్లు

డెడ్-రూ.3 కోట్లు

వైజాగ్ (ఉత్తరాంధ్ర)-రూ.5.25 కోట్లు

గుంటూరు-రూ.2 కోట్లు

కృష్ణా- రూ.1.95 కోట్లు

పశ్చిమగోదావరి-రూ.2.05 కోట్లు

తూర్పు గోదావరి-రూ.3.5 కోట్లు

నెల్లూరు-రూ.75 లక్షలు

కర్ణాటక-రూ.1.3 కోట్లు

యుఎస్- రూ.2.1 కోట్లు

ఏపీ-తెలంగాణ షేర్- రూ.29.6 కోట్లు

ఏపీ-తెలంగాణ గ్రాస్- రూ.43.9 కోట్లు

వరల్డ్ వైడ్ షేర్- రూ.33.3 కోట్లు

వరల్డ్ వైడ్ గ్రాస్-53.5 కోట్లు

దిల్ రాజు మాట్లాడుతూ...'శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ లో వచ్చిన బొమ్మరిల్లు చిత్రం తండ్రీ కొడుకుల మధ్య ఉండే సంబంధాన్ని అందం గా ప్రతిబింబించింది. ఇప్పుడు శతమానం భవతి తాతా మనవళ్ల మధ్య ఉండే బంధాన్ని చూపే ఒక అందమైన కుటుంబ కథా చిత్రం. మా బ్యానర్ కి బొమ్మరిల్లు సినిమా ఎంత పేరు తెచ్చిపెట్టిందో, ఈ శతమానం భవతి చిత్రం అంతటి పేరు ను తెచ్చింది', అని దిల్ రాజు తెలిపారు.

English summary
Sharwanand starrer Shatamanam Bhavathi total collections are here. The film stars Anupama Parameswaran in the female lead. Dil Raju is the producer and a new comer Satish vegesna is making his directional debut with the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu