»   »  ఇప్పుడిదో కొత్త ట్రెండా? మొన్న రామ్ చరణ్, ఇపుడు దిల్ రాజు కూడా (ఫోటోస్)

ఇప్పుడిదో కొత్త ట్రెండా? మొన్న రామ్ చరణ్, ఇపుడు దిల్ రాజు కూడా (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాత గా పేరున్న దిల్ రాజు నిర్మాణం లో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరో గా వేగేశ్న సతీష్ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం "శతమానం భవతి". అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 14 న, సంక్రాంతి కానుక గా విడుదల చేస్తున్నారు.

ఇప్పటి వరకు సినిమా ప్రమోషన్లంటే.... ఆడియో వేడుకలు నిర్వహించడం, ప్రీరిలీజ్ వేడుక నిర్వహించడం, లేదా కాలేజీలకు వెళ్లి ప్రమోట్ చేయడం చూసాం. అయితే టాలీవుడ్లో ఇపుడు కొత్త ట్రెండ్ ఊపందుకుంది.

 ఫేస్ బుక్

ఫేస్ బుక్

సోషల్ మీడియా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న ‘ఫేస్ బుక్' ఆఫీసుకు వెళ్లి అక్కడి పని చేసే ఉద్యోగులతో సమావేశం అయి సినిమాకు సంబంధించిన విషయాలు వారితో పంచుకోవడం లాంటివి చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఫేస్ బుక్ ద్వారా సినిమాకు మంచి ప్రచారం జరుగుతోంది.

ఇటీవల రామ్ చరణ్, ఇపుడు దిల్ రాజు

ఇటీవల రామ్ చరణ్, ఇపుడు దిల్ రాజు

ఇటీవల ఖైదీ మూవీ రిలీజ్ ముందు రామ్ చరణ్ ఫేస్ బుక్ ఆఫీసుకు వెళ్లి సందడి చేసారు. అక్కడి వారితో అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ అంటూ డాన్సులు చేసారు. ఇపుడు ఇదే బాటలో శతమానం భవతి నిర్మాత దిల్ రాజు ప్రయాణించారు.

 హీరోతో కలిసి

హీరోతో కలిసి

హీరో శర్వానంద్ తో కలిసి నిర్మాత దిల్ రాజు హైదరాబాద్ లోని ఫేస్ బుక్ ఆఫీసును సందర్శించారు. అక్కడి ఉద్యోగులతో కలిసి సందడి చేసారు.

 కుటుంబ కథా చిత్రం

కుటుంబ కథా చిత్రం

ఇది ప్రతి ఒక్కరూ చూడదగ్గ కుటుంబ కథా చిత్రమని, కుటుంబ కథా నేపధ్యం లో సాగే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుండి క్లీన్ U సర్టిఫికెట్ లభించింది, ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడాలని దిల్ రాజు సూచించారు.

 సంక్రాంతికి సంతోషంగా

సంక్రాంతికి సంతోషంగా

శతమానం భవతి తాతా మనవళ్ల మధ్య ఉండే బంధాన్ని చూపే ఒక అందమైన కుటుంబ కథా చిత్రం. జనవరి 14 న సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రం విడుదల అవుతుంది. సంక్రాంతి కి కుటుంబ సమేతం గా చూసి ఆనందించే చిత్రం మా శతమానం భవతి అని తెలిపారు.

 బొమ్మరిల్లు అంత పేరు

బొమ్మరిల్లు అంత పేరు

బొమ్మరిల్లు సినిమా మా సంస్థ కి ఎంత పేరు తెచ్చిందో , ఈ చిత్రం కూడా అంతే పేరు ని తెస్తుంది అన్న నమ్మకం ఉంది అని నిర్మాత దిల్ రాజు తెలిపారు.

నటీనటులు

నటీనటులు

ఈ చిత్రం లో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్ , జయసుధ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

 తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి కథ - దర్శకత్వం - మాటలు - స్క్రీన్ప్లే : సతీష్ వేగేశ్న , ఎడిటింగ్ - మధు , సినిమాటోగ్రఫి - సమీర్ రెడ్డి, సంగీతం - మిక్కీ జె మేయర్, నిర్మాతలు : రాజు , శిరీష్.

English summary
Dil Raju & Sharvanand pramots Shatamanam Bhavathi move at Facebook Hyderabad Office. Dil Raju and Sri Venkateswara Creations' 'Shatamanam Bhavathi', with Sharwanand and Anupama Parameshwaran in lead roles, is all set for a release on January 14th, 2017. The film has received a clean U from the board.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu