»   » టీవీ9 పై రానా సంచలన కామెంట్: ఆమె చెప్పినందుకే కోపం నటించా అంటూ

టీవీ9 పై రానా సంచలన కామెంట్: ఆమె చెప్పినందుకే కోపం నటించా అంటూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ హీరో రానా, తనను డ్రగ్స్ దందాపై ప్రశ్నించిన టీవీ9 మహిళా యాంకర్ పై సీరియస్ అయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తనను తాను కంట్రోల్ చేసుకోలేని స్థితిలో కోపంతో చూస్తూ, యాంకర్ పై చిటికలు వేస్తూ, ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయవద్దని సీరియస్ గా ఆయన వార్నింగ్ ఇవ్వడంతో యాంకర్ బిత్తర చూపులు చూడగా, రానాకు అంత ఆగ్రహం ఎందుకని నెటిజన్లు ప్రశ్నించారు కూడా. ఈ వీడియో అంతా ఫేక్ అని, ప్రోమో కట్ కోసం యాంకర్ చెప్పినట్టుగా తాను చేశానని రానా స్వయంగా అంగీకరించాడు.

నిజంగానే యాంకర్ పై ఆగ్రహాన్ని చూపారా?

నిజంగానే యాంకర్ పై ఆగ్రహాన్ని చూపారా?

"సార్, మీరు నిజంగానే టీవీ 9 యాంకర్ పై ఆగ్రహాన్ని చూపారా? లేక అది పబ్లిసిటీ కోసమా? అని ఓ అభిమాని ప్రశ్నించగా, ఆమే అలా చెప్పాలని సూచించింది. ప్రోమో కట్ కోసమే ఇదంతా అని రానా ఈ ఉదయం 9:43 గంటల సమయంలో సమాధానం ఇచ్చాడు."

Nene Raju Nene Mantri Press Meet : Bharath Chowdhary About Rana
రానా పేరు మీద పార్సిల్

రానా పేరు మీద పార్సిల్

టాలీవుడ్ చిత్ర పరిశ్రమను కొన్ని రోజులుగా డ్రగ్స్ కేసు కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. చాలా వరకు డ్రగ్స్ విదేశాల నుండి పార్శల్స్ రూపంలో వస్తున్నాయని గ్రహించిన అధికారులు నిఘా పెట్టారు. ఇటీవల రామానాయుడు స్టూడియోకి విదేశాల నుండి హీరో రానా పేరు మీద పార్సిల్ రావడంతో ఎక్సైజ్ శాఖ సీఐ పరిశీలించేందుకు వెల్లడం చర్చనీయాంశం అయింది.

నేను రాజు నేనే మంత్రి

నేను రాజు నేనే మంత్రి

ప్రస్తుతం 'నేను రాజు నేనే మంత్రి' సినిమా ప్రమోషన్లలో భాగంగా టీవీ 9 ఇంటర్వ్యూలో పాల్గొన్న రానాకు డ్రగ్స్ కేసు, రామానాయుడు స్టూడియోకు వచ్చిన పార్శిల్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.డ్రగ్స్ వ్యవహారం గురించి, రామానాయుడు స్టూడియోకు వచ్చిన పార్శల్ గురించి అడగ్గానే రానా... ఆగ్రహంతో ఊగిపోయారు.

 రానా అంత కోపం చూపించటం

రానా అంత కోపం చూపించటం

పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయద్దంటూ యాంకర్ మీద అరిచాడు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రానా అంత కోపం చూపించటం చాలామందిని ఆశ్చర్యనికి గురి చేసింది... అయితే ఇప్పుడు దానివెనక ఉన్న స్టోరీని, ప్రేక్షకులని ఫూల్స్ చేసి టీఆర్పీ లని పెంచుకునే ప్రయత్నాలనీ బయటపెట్టేసాడు రానా...

నిజమేనా లేక ప్రీ ప్లాన్డా

నిజమేనా లేక ప్రీ ప్లాన్డా

అయితే ఇదంతా నిజమేనా లేక ప్రీ ప్లాన్డా అనేది మనం ఆ ప్రోమోని చూసినప్పుడే అర్దమవుతుంది.మొన్న వీఐపీ 2 సినిమా ఇంటర్వ్యూ అప్పుడు కూడా ధనుష్ దాదాపు స్టూడియో నుంచి వెళ్ళిపోయినంత పని చేసాడు , 'విఐపి-2' సినిమా ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూకు వస్తే తన పర్సనల్ లైఫ్ విషయాలను అడగటంతో నొచ్చుకున్న ధనుష్ 'స్టుపిడ్ ఇంటర్వ్యూ' అంటూ వాకౌట్ చేశాడు.

ఈ వీడియో అంతా ఫేక్

ఈ వీడియో అంతా ఫేక్

ధనుష్ వాకౌట్ చేసిన వీడియోను టీవీ 9న యూట్యూబ్‌లో విడుదల చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే తరహా లో ఇప్పుడు ఈ వీడియో అంతా ఫేక్ అని, ప్రోమో కట్ కోసం యాంకర్ చెప్పినట్టుగా తాను చేశానని రానా స్వయంగా అంగీకరించాడు.ఒక రకంగా ఈ విషయం చెప్పి ఇలాంటి ప్రోమోల విషయం లో జనాన్ని టీవీ చానెళ్ వాళ్ళు ఎంత ఆడుకుంటున్నారో చెప్పాడు

English summary
"She asked me to Say it so thay cancut a Promo" Rana Revealed the secret Behind his angry on TV anchor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu