»   » సెక్స్, పిల్లల కోసం తప్ప మగాళ్ళు అవసరం లేదు: ఇలా అనేసింది మరి

సెక్స్, పిల్లల కోసం తప్ప మగాళ్ళు అవసరం లేదు: ఇలా అనేసింది మరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ లో అడుగుపెట్టి 'క్వాంటికో' సిరీస్ తో గ్లోబల్ స్టార్ గా మారిపోయింది ప్రియాంకా చోప్రా. 'బేవాచ్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తించడానికి రెడీ అయింది. తాజాగా, అసోం టూరిజం ప్రచారకర్తగా కూడా ప్రియాంక నియమితురాలైంది.88వ వార్షిక అకాడెమీ అవార్డ్స్ ఫంక్షన్‌కు స్ట్రాప్ లెస్‌గౌన్‌లో అప్పియరెన్స్ ఇచ్చి ఫ్యాన్స్‌కు మతులు పోగొట్టిందీ ముద్దుగుమ్మ.

తాను టోటల్‌గా యూఎస్‌కు ఫిప్ట్ కాలేదని, ముంబైలో సొంతిల్లు ఉందంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఈ ఫంక్షన్‌లో ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌తో టీమ్ మొత్తంలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. జనసంద్రంగా మారిన ఇన్వైటీస్‌లో చాలా మంది అస్సామీలు ఉండటం, గౌహతీ స్టూడియోలో వాళ్లంతా ప్రియాంకాతో సెల్ఫీలు దిగడం, ఆ వెంటనే అస్సోం ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్‌గా అపాయింట్ చేయడంతో పొంగిపోతోంది ఈ అమ్మడు.

ఇక యూఎస్ టీవీ ప్రైమ్ టైంలో వచ్చే బేవాచ్‌లో ఛాన్స్ రావడంతో ఇక ప్రియాంక అక్కడే సెటిలవుతుందన్న గాసిప్స్‌కు ఆమె ఫుల్‌స్టాప్ పెట్టేసింది. తన పుట్టిల్లు ముంబై అని, ఆ ప్రాంతాన్ని విడిచి పెట్టేదిలేదని కుండబద్దలు కొట్టింది. ఇంతకుముందు విడుదలైన బేవాచ్ టీజర్‌లో కొన్ని సెకన్లు మాత్రమే చూపించడంతో హర్ట్ అయిన ఫ్యాన్స్‌కు తనది ఇంతో ఇంపార్టెంటెన్స్ వున్న క్యారెక్టర్ అని, ఇక నుంచి వచ్చే టీజర్లలో ఎక్కువ సేపు కనిపిస్తానంటూ ఆమె భరోసా ఇచ్చింది.

She doesn't need a man for anything other than to reproduce says Priyanka Chopra

ఈ సందర్భంగా మీడియాతో ఫెమినిజం గురించి మాట్లాడిన ప్రియాంక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ స్వయం సాధికారత సాధిస్తున్నారని, మగవాడిపై ఆధారపడి బతికే రోజులు పోయాయని వ్యాఖ్యానించింది. కేవలం శృంగార అవసరం తీర్చుకునేందుకే ఆడవారికి మగవారితో పని అని పేర్కొంది.

కాగా, ఇటీవల విడుదలైన 'బేవాచ్‌' ట్రైలర్‌లో కేవలం కొన్న సెకెన్ల పాటు మాత్రమే కనిపించడంపై స్పందిస్తూ.. ఆ సినిమాలో తాను చాలా ఇంపార్టెంట్‌ రోల్‌ ప్లే చేస్తున్నానని, త్వరలో విడుదలయ్యే ట్రైలర్స్‌లో తన స్ర్కీన్‌ టైమ్‌ ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

English summary
The National Award winning actress Priyanka Chopra has declared that she does not need a man for anything except to have children.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu