»   »  హిందీ 'హ్యాపీడేస్'నిర్మాత ఆయనా!?

హిందీ 'హ్యాపీడేస్'నిర్మాత ఆయనా!?

Posted By:
Subscribe to Filmibeat Telugu
shekar kapoor
శేఖర్ కమ్ముల బాలీవుడ్ లోకి ప్రవేశిస్తున్నారంటూ వస్తున్న వార్తలు నిజమవుతున్నాయి. ఆయన రీసెంట్ సూపర్ హిట్ హ్యాపీడేస్ ని హిందీలో రూపొందించబోతున్నారు. అయితే అసలైన సెన్సేషన్ ఏమిటంటే ప్రపంచవాప్తంగా గుర్తింపు పొందిన శేఖర్ కపూర్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహిరించబోవటం. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ డీల్ చాలా కాలం క్రిందటే ఓకే అయింది. అయితే కొంత కాలంపాటు దీన్ని శేఖర్ కమ్ముల కాన్ఫిడియెన్షియల్ గా ఉంచి అఫీషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది.

ఇక మొదట శేఖర్ ఈ ప్రాజెక్టు నిమిత్తం బోనీ కపూర్ ని సంప్రదించారు. అయితే ఆయన డిలే చేస్తూండటం,బ్రాండ్ వాల్యూని దృష్టిలో పెట్టుకుని శేఖర్ కపూర్ తో ఎగ్రిమెంట్ అయ్యారని సమాచారం. ఇక ఈ సినిమా తెలుగు వెర్షన్ కి పనిచేసిన సాంకేతిక వర్గమే హిందీ హ్యాపీడేస్ కీ పనిచేయనుంది. నటీనటులను మంబయి,పూనా లలో టాలెంట్ సెర్చ్ జరిపి ఎంపిక చేస్తారని అనుకుంటున్నారు. ఏదైమైనా మరో తెలుగు యువ కెరటం బాలీవుడ్ ప్రముఖ దర్శకుడుని మెప్పించి ప్రొడ్యూస్ చేయించటం అనేది గొప్పవిషయమే కదా...బెస్టాఫ్ లక్ శేఖర్ కమ్ముల.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X