»   » చదవంటే ఇంజినీరింగ్, డాక్టర్లే కాదు.. హ్యాట్సాఫ్ వేణు.. నీది నాది ఒకే కథకు శేఖర్ కమ్ముల ప్రశంస

చదవంటే ఇంజినీరింగ్, డాక్టర్లే కాదు.. హ్యాట్సాఫ్ వేణు.. నీది నాది ఒకే కథకు శేఖర్ కమ్ముల ప్రశంస

Posted By:
Subscribe to Filmibeat Telugu
ప్రతి విద్యార్ధి చూడాల్సిన చిత్రం...మనందరి కథ !!

దర్శకుడు వేణు ఊడుగుల రూపొందించిన నీది నాది ఒకే కథ సినిమా విడుదలకు ముందే మంచి క్రేజ్ సంపాదించుకొన్నది. ఇప్పటికే ఈ సినిమాను చూసిన దర్శకులు దేవాకట్టా, కత్తి మహేష్ ప్రశంసలతో ముంచెత్తారు. సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను పంచుకొన్నారు. తాజాగా ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల చూడటం జరిగింది. ఈ సినిమా చూసిన తర్వాత దర్శకుడు, హీరో శ్రీ విష్ణు, చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఆయన ఏమన్నారంటే..

 భావోద్వేగమైన కథ

భావోద్వేగమైన కథ

నీది నాది ఒకే కథ చిత్రం మనందరి కథలా ఉంటుంది. సినిమా ఆద్యంతం భావోద్వేగంగా సాగింది. సినిమా చూస్తూన్న సేపు నేను ఎక్సైట్‌మెంట్‌కు లోనయ్యాను అని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు.

 హ్యాట్సాఫ్ వేణు ఊడుగుల

హ్యాట్సాఫ్ వేణు ఊడుగుల

దర్శకుడు వేణు ఊడుగులకు ఇది మొదటి సినిమా. కానీ కథను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. కథను సజీవంగా తీర్చిదిద్దినందుకు రియల్లీ హ్యాట్సాఫ్ అని శేఖర్ కమ్ముల అన్నారు.

విద్యావ్యవస్థలోని లోపాలపై

విద్యావ్యవస్థలోని లోపాలపై

ఎంసెట్‌ మార్కులు, ఇంజినీరింగ్, డాక్టర్ పట్టాలకే మన విద్యావ్యవస్థ పరిమితమవుతున్నది. పట్టాలు సాధించి వాటిని గోడలకు కట్టేసుకొని సంతోషపడుతుంటాం. పిల్లల్ని మార్కుల రేసులో పడేసి ఒకర్నొకరు కొట్టేసుకొమని చెప్పే పరిస్తితి. ఈ రేసులో ఎవరు గెలిస్తే వారే విజేత. ఇంజనీరింగ్‌లో మార్కులు సాధించి ఉద్యోగం సాధిస్తేనే గొప్ప అనే భావన నెలకొంది. లేకపోతే వేస్ట్ ఫెలోగా డిసైడ్ చేస్తాం. అలాంటి వారికి ఈ సినిమా ఆశ కలిగించే సినిమా నీది నాది ఒకే కథ.

 విద్యార్థులపై ఒత్తిడి

విద్యార్థులపై ఒత్తిడి

నీది నాది ఒకే కథలో సమాజంలో విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి, విద్యా వ్యవస్థలోని లోపాల గురించి చాలా చక్కగా చూపించారు. ఇక పిల్లల పరిస్థితి కూడా తల్లిదండ్రులను మెప్పించాలన్న విధంగానే తయారైంది. ఈ చిత్రంలో తండ్రి, కొడుకుల రిలేషన్ బ్యూటిఫుల్‌గా తెరకెక్కించారు.

శ్రీవిష్ణు యాక్టింగ్ బాగుంది

శ్రీవిష్ణు యాక్టింగ్ బాగుంది

నీది నాది ఒకే కథలో శ్రీవిష్ణు యాక్టింగ్ బాగా ఉంది. గత సినిమాలలో కంటే మెరుగ్గా ఉంది. ఈ చిత్రంలో తాను మాట్లాడిన రాయలసీమ యాస నవ్విస్తూ, ఏడిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సినిమాలు తప్పకుండా రావాలి. ప్రస్తుత సమాజానికి అవసరం ఉన్న సినిమా. అందరూ చూడాలని కోరుకొంటున్నాను అని శేఖర్ కమ్ముల తన పోస్టులో పేర్కొన్నారు.

English summary
Director Venu Vudugula, Hero SriVishnu's movie is Needi Naadi Oke Katha. This movie got special attention, before its release. Needi Naadi Oke Katha set to release on March 23. In this occassion, Director Shekhar Kammula happend to see this movie. He praises Venu Vudugula and SriVishnu and film unit.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X