శ్రీరెడ్డికి శేఖర్ కమ్ముల వార్నింగ్.. అయినా లెక్క చేయని నటి.. త్వరలోనే మరిన్నీ లీకులంటూ..

By Rajababu

టాలీవుడ్ నటి శ్రీరెడ్డి మల్లిడి, దర్శకుడు శేఖర్ కమ్ముల మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. తనపై నిరాధార ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే కఠినచర్యలు తీసుకొంటానని శేఖర్ కమ్ముల సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. రెండు రోజుల క్రితం శేఖర్ కమ్ములపై శ్రీరెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పలువురు టాలీవుడ్ ప్రముఖులపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యల చేసినప్పటికీ తొలిసారి శేఖర్ కమ్ముల స్పందించారు. దాంతో ఇక ఆమెకు కష్టాలు తప్పవనే మాట వినిపిస్తున్నది.

Recommended Video

తెలుగు అమ్మాయిలంటే పక్కలోకి తప్ప ఎందుకు పనికి రారు : శ్రీరెడ్డి
శేఖర్ కమ్ముల గురించి శ్రీరెడ్డి

శేఖర్ కమ్ముల గురించి శ్రీరెడ్డి

టాలీవుడ్ డైరెక్టర్‌ శేఖర్ కమ్ములను ఉద్దేశించి.. పెద్ద డైరెక్టర్ అని పొగరు. అబద్దాలు చెప్పటంలో దిట్ట. తెలుగు అమ్మాయిలంటే పక్కలోకి తప్ప ఎందుకు పనికి రారని అతనికి ప్రగాఢ విశ్వాసం. ప్రామిసెస్ బ్రేక్ చేయడంలో వారి తర్వాతే ఎవరైనా. బక్కపీచు సొగ్గాడు. ఊదితే ఎగిరిపోయే ఇతనికి భయం, బలం రెండు ఎక్కువ. టెక్నికల్‌గా దొరకకుండా బాగా వాడాడు టెక్నాలజీని. మా ఇంటికి కింద గూర్ఖాలా తిరిగేవాడు. వీడియో కాల్ కోసం ఏమైనా కోసేసుకొంటాడు పాపం. ఆర్టిస్టుల దగ్గర డబ్బులు గుంజుతాడని టాక్. ఇంతకీ అతను ఎవరు అని అనుకొంటున్నారా? అతడే కొమ్ములు వచ్చిన శేఖరుడు అని శ్రీరెడ్డి పోస్ట్ చేసింది.

మనస్తాపం చెందాను

మనస్తాపం చెందాను

శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై శేఖర్ కమ్ముల తీవ్రంగా స్పందించాడు. ‘నన్ను కించపరుస్తూ, సోషల్ మీడియాలో నిన్న వచ్చిన పోస్ట్, నా దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్‌లో ప్రతీ మాట అబద్ధం. అసభ్యం. అవమానకరం. ఆ పోస్ట్ నాకు, నా కుటుంబానికి, నన్ను గౌరవించేవారికి చాలా మనస్థాపం కలిగించింది' అని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు.

నాపై నిరాధార ఆరోపణలు

నాపై నిరాధార ఆరోపణలు

నేను ఎప్పుడూ కలవని, అసలు చూడనే చూడని, కనీసం ఫోన్లో కుడా మాట్లాడని అమ్మాయి.. నా గురించి ఆధారం లేని ఆరోపణలు చేయటం షాకింగ్ గా ఉంది.
ఈ దిగజారుడు చర్య వెనక ఎవరున్నా, వారి ఉద్దేశం ఏమైనా, నేను చెప్పదల్చుకున్నది ఒకటే. ఇది తప్పు, నేరం, అనైతికం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 నాపై బురదజల్లే ప్రయత్నం

నాపై బురదజల్లే ప్రయత్నం

స్త్రీల సమానత్వం, సాధికారతలని నేను ఎంత నమ్ముతానో నా సినిమాలు, నా కార్యక్రమాలు చూస్తే అర్ధమౌతుంది. నా వ్యక్తిత్వం, నమ్మే విలువలు నా ప్రాణం కంటే ముఖ్యం. వాటి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే, వదిలి పెట్టే ప్రసక్తి లేదు. ఆ పోస్ట్ లోని ప్రతీ మాట తప్పు అని ఒప్పుకొని, క్షమాపణ చెప్పకపోతే, చట్టపరంగా చర్యలు తీసుకుంటాను అని శేఖర్ కమ్ముల హెచ్చరించారు.

శేఖర్ కమ్ములా? ఎవరో..

శేఖర్ కమ్ములా? ఎవరో..

ఇదిలా ఉండగా, మంగళవారం (ఏప్రిల్3న) శ్రీరెడ్డి ఫేస్‌బుక్ లైవ్‌లో నెటిజన్లతో ఛాటింగ్ చేసింది. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల గురించి ఓ నెటిజన్ ఓ ప్రశ్నను అడుగగా, శేఖర్ కమ్ముల ఎవరో నాకు తెలియదు అంటూ దీర్ఘాలు తీసింది.

త్వరలోనే మరిన్ని సంచలనాలు..

ఇక నుంచి టీవీ ఛానెళ్లకు గానీ, యూట్యూబ్ ఛానెళ్లకు గానీ ఇంటర్వ్యూలు ఇవ్వను. ప్రస్తుతం ఓ విషయంలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. అప్పటిదాకా ఎవరి పేర్లు లీక్ చేయను. కానీ త్వరలోనే సంచలన విషయాలు వెల్లడిస్తాను అని శ్రీరెడ్డి చెప్పింది. అంతేకాకుండా ఇంతటితో లీకుల పర్వాన్ని ఆపాలని, కావాలంటే ఎంత డబ్బైనా ఇస్తాం అని కొందరు ఫోన్లు చేస్తున్నారని శ్రీరెడ్డి ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X