»   » డ్రగ్స్ తీసుకునే ఆ హీరోయిన్ కు ఫ్లాఫ్ లే ఫెరఫెక్ట్ అన్న సీనియర్, ఇండస్ట్రీ షాక్

డ్రగ్స్ తీసుకునే ఆ హీరోయిన్ కు ఫ్లాఫ్ లే ఫెరఫెక్ట్ అన్న సీనియర్, ఇండస్ట్రీ షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : తమకి పడనివాళ్లు ఫెయిల్యూర్స్ కు వెళ్లినప్పుడు ఆ ఆనందాన్ని కొందరు డైరక్ట్ గానే చూపిస్తూంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక, ఏది మనస్సులో ఉంచుకోవటం లేదు. ఏది అనుకుంటే అది ట్విట్టర్, ఫేస్ బుక్ సాక్షిగా కక్కేస్తున్నారు. అలా ఇప్పుడు కంగనారనత్ మాజీ బోయ్ ఫ్రెండ్ ...ఆమెతో ఉన్న పాత కక్షలు మనస్సులో పెట్టుకుని చేసే కామెంట్స్ పెద్ద వివాదాన్నే రేపుతున్నాయి. ఇంతకీ ఎవరా మాజీ ప్రేమికుడు..ఏమా కామెంట్స్ అంటే...

బాలీవుడ్‌ నటులు సైఫ్‌ అలీఖాన్‌, షాహిద్‌ కపూర్‌, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'రంగూన్‌'. 2.47 గంటల నిడివి గల ఈ చిత్రం శుక్రవారం (ఫిబ్రవరి 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఊహించనంత స్దాయిలో హిట్ కాలేదు. సినిమా బాగుందంటున్నా... కలెక్షన్స్ కనపడటం లేదు. దాదాపు ఈ సినిమా ఫ్లాఫ్ అని డిక్లేర్ చేసేసారు.

ఈ నేపధ్యంలో ఈ ఫ్లాఫ్ వార్త ఆమె మాజీ బోయ్ ఫ్రెండ్ ఆధ్యయన్ సుమన్ తండ్రి శేఖర్ సుమన్ కు మంచి ఆనందం ఇచ్చినట్లుంది. దాంతో ఆయన పాత విషయాలు తవ్వేసారు. కొకైన్ తీసుకునే నటికి మంచి శాస్త్రే జరిగిందనే అర్దం వచ్చేలా ఇదిగో ఈ క్రింది విధంగా ట్వీట్ చేసారు.

అయితే ఈ విషయమై అందరూ శేఖర్ సుమన్ ని తప్పు పట్టారు. ఈ ట్వీట్స్ రిప్లైగా వరస పెట్టి ఆయన పై విమర్శలు చేస్తూ కంగనా అభిమానులు రచ్చ రచ్చ చేసారు. దాంతో ఒక టైమ్ లో ఆయన ఇదంతా కంగనా గురించి కాదు అంటూ ట్వీట్ చేయాల్సిన పరిస్దితి వచ్చింది.

గతంలో నటుడు ఆధ్యయన్ సుమన్ సైతం ఆమె కొకైన్ గురించి మాట్లాడారు. , "2008 మార్చిలో ఆమె పుట్టిన రోజున తనతో పనిచేసిన అందరినీ ఆహ్వానించింది. వచ్చివారితో ఈ రాత్రి మనం కొకైన్ తీసుకుందామంది. నేను ఇంతకు ముందు ఆమెతో కలిసి కొన్ని సార్లు కొకైన్ తీసుకున్నాను కానీ నాకు పెద్ద నచ్చలేదు. దాంతో వద్దు అన్నాను. నాకు చాలా బాగా గుర్తుంది ఆ రోజు పెద్ద గొడవైంది. నేను కొకైన్ తీసుకోనందుకు ఆమె నన్ను తప్పు పడుతూ ఆ రాత్రంగా గొడవ గొడవ చేసింది ." అన్నారు.

ఇక రంగూన్ విషయానికి వస్తే...పీరియాడిక్‌ చిత్రాలు తీయడంలో ప్రత్యేకత చాటుకున్న దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌ దీనిని తెరకెక్కించారు. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఓ ముక్కోణపు ప్రేమకథగా ఈ చిత్రాన్ని మలిచారు. సైఫ్‌ అలీఖాన్‌.. షాహిద్‌ కపూర్‌.. కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో కలిసి నటించిన తొలి చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది.

Shekhar Suman credit Rangoon failure to Kangana Ranaut

జూలియా పాత్రలో కంగనా రనౌత్‌ ఒదిగిపోయింది. తనదైన నటనతో ఆకట్టుకుంది. ఓవైపు ప్రేమికుడు, మరోవైపు కాబోయే భర్త మధ్య నలిగిపోయే యువతిగా చక్కని నటనను కనబరిచింది.

1940ల్లో యాక్షన్‌ హీరోయిన్ గా బాలీవుడ్‌లో గుర్తింపు తెచుకున్న ఫియర్‌లెస్‌ నదియా జీవితం ఆధారంగా కంగన పాత్రను రూపొందించినట్లు వివాదం చెలరేగింది. ఫియర్‌లెస్‌ నదియా నటించిన 'హంటర్‌వాలి' చిత్రం నుంచి 'రంగూన్‌'లో 19 సన్నివేశాలు కాపీ కొట్టారంటూ 'హంటర్‌వాలి' నిర్మాతలు ఫిర్యాదు చేశారు. ఫియర్‌లెస్‌ నదియా తరహాలో కొరడా చేతపట్టి కంగన నటించిన 'బ్లడీహెల్‌' అనే పాటకు మంచి స్పందన వస్తోంది.

English summary
Kangana Ranaut received a rude shock in the form of dismal Box Office performance of 'Rangoon'.After the failure of her movie Rangoon, Adhyayan's dad Shekhar Suman took to Twitter to spew some more venom. He wrote, "One cocained actress was carrying the burden of her non existent stardom. She has fallen flat on her face n how. Guess this is poetic justice."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu