»   »  ఈ హీరోయిన్ బంగ్లా ముందు షారూఖ్ భవంతి కూడా బలాదూరే(ఫొటోలు)

ఈ హీరోయిన్ బంగ్లా ముందు షారూఖ్ భవంతి కూడా బలాదూరే(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: షారూఖ్ ఖాన్ నివాసం ఉండే మన్నత్ ని చాలా గొప్పగా చెప్తూంటారు. అంత అద్బుతంగా ఇంటీరియర్ డెకరేట్ చెయ్యలేదు. అంత విశాలమైన గదులు ఎక్కడా ఉండవు. అంత అందమైన ఫర్నిచర్ ఉండదు. షారూఖ్ టేస్ట్ అంతా అక్కడే కనపడుతుంది. ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు..వంటి మాటలన్ని ఇక వినపడే అవకాసం తక్కువ. ఎందుకంటే అంతకన్నా అద్బుతంగా బాలీవుడ్ మాజీ హీరోయిన్ శిల్పాశెట్టి భవంతి ఉంది.

శిల్పాశెట్టి అందమైన ఇల్లు కిన్నర ని చూసిన వారు ఓ డ్రీమ్ ప్లేస్ గా అభివర్ణిస్తూంటారు. అది నిజమా కాదా అంటే మేం మీకు అందిస్తున్న ఈ ఫొటోలు చూడండి ముంబైలో రాజ్ కుంద్రా, అతని భార్య శిల్పా శెట్టి కుంద్రా కట్టుకున్న కలక సౌధం ఇది.

శిల్పాశెట్టి ఇంట్లో ఇన్ సైడ్ పిక్చర్స్ ఇవి. సముద్రం ఫేస్ చేస్తూ బాల్కని, ఇంకా మరెన్నో వాహ్ అద్బుతం అనిపించే గదులు. సినిమా సెట్టింగ్ లు సైతం ఈ ఇంటి ముందు తెల్లబోతాయి. ఫారిన్ నుంచి ప్రత్యేకంగా రప్పించిన డిజైనర్స్ నెలలు తరబడి చేసిన వర్క్ ఇది అని చెప్తున్నారు.

రీసెంట్ గా ఓ ఎంటర్ట్మైంట్ డైలీకు శిల్పా శెట్టి ఇచ్చిన ఇంటర్వూలో తనకు ఈ లగ్జరియస్ బంగ్లా కిన్నెర అంటే ఎంత ఇష్టమో చెప్పుకొచ్చింది. ఆమె ఈ బంగ్లా గురించి ఎన్నో విషయాలు వెల్లడించింది. వాటిని ఫొటోలతో పాటు క్రింద చదవండి.

ఆ ఫొటోలు మీరు స్లైడ్ షోలో చూడవచ్చు.

బాగా నచ్చేది

బాగా నచ్చేది

మా భవంతిలో నాకు బాగా నచ్చేది సీ వ్యూ అంటోంది శిల్పాశెట్టి

ఓ రాత్రివేళ...

ఓ రాత్రివేళ...

నిద్రలోంచి లేచి సముద్ర అలలు చూస్తూ, వాటినుంచి వచ్చే శబ్దాలు వింటూ మళ్ళీ నిద్రలోకి జారటం ఓ ప్రత్యేకమైన అనుభూతి అంటోంది

అదే ఇబ్బంది

అదే ఇబ్బంది

ఈ భవంతితో వచ్చిన ఏకైన సమస్య అంతా హై మెయింటినెన్స్ మాత్రమే అంటోంది.

పెద్దది కావటంతో

పెద్దది కావటంతో

ఇది పెద్ద ప్రాపర్టీ కావటంతో మెయింటినెన్స్ చాలా కష్టంగా ఉంది

రూమర్స్

రూమర్స్

శిల్పా శెట్టి, ఆమె భర్త విడిపోతున్నారంటూ ఆ మధ్యన రూరర్స్ వచ్చాయి.

రొమాంటిక్ పిక్స్

రొమాంటిక్ పిక్స్

ఆ రూమర్స్ ని ఖండించటానికి సోషల్ మీడియాలో తమ జంట రొమాంటిక్ పిక్స్ ని పోస్ట్ చేసింది శిల్పా

ఇంటర్వూలద్వారా

ఇంటర్వూలద్వారా

అంతేకాకుండా అవకాసం దొరికినప్పుడల్లా ఇంటర్వూలు ఇస్తూ శిల్పా, ఆమె భర్త రూమర్స్ ని ఖండిస్తూనే ఉన్నారు.

చాలా సంతోషంగా

చాలా సంతోషంగా

ఈ భవంతిలో తాము జీవితం చాలా సంతోషంగా గడుపుతున్నట్లు శిల్పా చెప్పింది.

పెళ్లయిన తర్వాత కూడా...

పెళ్లయిన తర్వాత కూడా...

శిల్పా.. టీవీ కార్యక్రమాలు, వివిధ వ్యాపారాలతో దూసుకెలుతోంది. ఫిట్ నెస్ క్వీన్ పేరు తెచ్చుకుంది.

 రూల్ కు మద్దతు

రూల్ కు మద్దతు

దిష్కియోన్ చిత్రంతో నిర్మాతగా మారిన శిల్పా శెట్టి.. సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భం దాల్చకూడదనే నిబంధనకు మద్దతు తెలుపుతోంది.

కత్తి ఉండాలి

కత్తి ఉండాలి

స్వీయ రక్షణ విషయంలో మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలనీ...సదా ఓ కత్తిని వెంట ఉంచుకోవాలనీ శిల్పాషెట్టి సూచించారు. దురుద్దేశంతో హానికి తెగబడే దుండగుల నుంచి రక్షణ పొందడానికి కత్తి అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు

ఆరోపణలు వచ్చినా

ఆరోపణలు వచ్చినా

కామన్‌వెల్త్‌ క్రీడల నిర్వహణలో భార్యాభర్తలు ఇద్దరూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చనా ఎక్కడా చెక్కు చెదరలేదు

కొడుకు

కొడుకు

శిల్పాశెట్టి తన కొడుకు 'వియాన్‌' అంటే ప్రాణం. ఎక్కడకి వెళ్లినా వాడు తోడు ఉండాల్సిందే అంటుంది

తెలుగులో

తెలుగులో

వెంకటేష్ హీరోగా వచ్చిన ‘సాహస వీరుడు సాగర కన్య' చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన శిల్పా శెట్టి ఆ తర్వాత ‘వీడేరా దాని బాబు', నాగార్జున సరసన ‘ఆజాద్', బాలయ్య సరసన ‘భలేవాడివి బాసు' చిత్రాల్లో నటించింది.

హాట్ టాపిక్

హాట్ టాపిక్

బాలీవుడ్ సర్కిల్స్ లో ఇప్పుడు శిల్పాశెట్టి హౌసే హాట్ టాపిక్, ఆమె అదృష్టం ఆ ఇల్లే అంటూ మాట్లాడుకుంటున్నారు.

English summary
Shilpa Shetty Kundra 's beautiful home 'Kinara' is nothing short of a dream palace. So, gear upto witness one of the most poshest homes of Mumbai, which is owned by Raj Kundra & wife Shilpa Shetty Kundra. From the inside pictures of Shilpa's 'Kinara' to its sea facing balcony view, our below gallery has it all, which will surely make you say 'whoa'!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu