twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘శివ' ఈజ్ బ్యాక్ : రీరిలీజ్...పోస్టర్ ఇదిగో

    By Srikanya
    |

    హైదరాబాద్: ‘శివ' కు ముందు తెలుగు సినిమా...‘శివ' తర్వాత తెలుగు సినిమా అని రెండు భాగాలుగా మార్చి ట్రెండ్ ని సెట్ చేసిన చిత్ర రాజం ‘శివ'.తెలుగు సినిమా గతిని మార్చి, తెలుగు సినిమా ప్రేక్షకుడి మతి పోగొట్టి చరిత్రలో నిలిచిపోయిన చిత్రం ‘శివ'. ఈ చిత్రం ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయటానికి సన్నాహాలు పూర్తైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని వదిలారు. ఇప్పుడున్న టెక్నాలిజీకి అణుగుణంగా డిజిటల్ లోకి మార్చి రీ మాస్టర్ ప్రింట్ తో విడుదల చేస్తారు. అందుతున్న సమాచారం ప్రకారం మే 15న శివ విడుదల చేయటానికి నిర్ణయించారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఈ చిత్రాన్ని రీ మాస్టర్ ఫ్రింట్ చేయటానికి నాలుగు నుంచి ఐదు కోట్ల వరకూ ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. లాభ,నష్టాలు ప్రసక్తి లేకుండా ఓ మంచి జ్ఞాపకంగ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. నాగార్జున, రామ్ గోపాల్ వర్మ అభిమానులు సైతం ఈ చిత్రం రీరిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.

    'Shiva' is back rerelease poster

    నాగార్జున మాట్లాడుతూ... నా జీవితాన్ని మార్చిన సినిమా శివ. జీవితంలో ఎన్నో తప్పులు చేశాను. కాని, బాధపడను. ఎందుకంటే ‘శివ' అనే సినిమాలో నటించి, నిర్మించి ఒక కరెక్ట్ పని చేశాను. ఈ సినిమాను తిరిగి విడుదల చేస్తున్నాం. డిజిటల్ రీమాస్టర్ ప్రింట్ తో సుమారు 100 థియేటర్లలో ‘శివ' సినిమాను ప్రదర్శిస్తాం అని నాగార్జున అన్నారు.

    నాగార్జున మాట్లాడుతూ..' వర్మ ఒక సెల్యూలాయిడ్‌ సైంటిస్ట్‌. ఆకాశంలో నక్షత్రాలు, గ్రహాలు ఉంటాయి. కానీ అక్కడ మనలాంటి మనుషులే ఉంటారని చిన్నప్పుడు అనుకునే వాడిని. అలాంటి నక్షత్రాల్లోంచి ఊడిపడిన వ్యక్తే వర్మ. అప్పట్లో వర్మ తండ్రి రాజు అన్నపూర్ణ స్టూడియోలో సౌండ్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. అయన మా అబ్బాయి కథ చెబుతాడని నా వద్దకు వచ్చారు.

    మొదట 'రాత్రి' అనే కథ చెప్పాడు. అలాంటి కథలు మన వాళ్లు చూడరు. హీరోయిజం ఉన్న కథ చెప్పమని అడిగితే.. కొద్ది రోజుల్లోనే 'శివ' కథ చెప్పాడు. అందులో ఏదో కొత్తదనం అనిపించింది. సినీ లైఫ్‌నే కాకుండా, నా వ్యక్తిగత జీవితాన్ని కూడా మార్చిన సినిమా శివ. శివ సినిమాల్లోని అన్ని విభాగాలు కొత్తగా మార్పులు చేసి విడుదల చేస్తున్నాము.' అని అన్నారు.

    రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ... శివ సినిమాతో అందరూ నేను రూల్స్ బ్రేక్ చేసానని అంటూంటారు. కానీ అది తప్పు. ఎందుకంటే అప్పటికి నాకు అస్సలు రూల్స్ అనేవే తెలియదు. అందుకే ఆ చిత్రం ట్రెడ్ సృష్టించింది. ఇప్పటికీ, ఎప్పటికీ నేను చెప్పేది ఒకటే శివ కేవలం నాగార్జున వల్లే సాధ్యమైంది అన్నారు.

    English summary
    Akkineni Nagarjuna’s ‘Shiva’ recently completed 25 years and makers of the film had announced about the film’s rerelease then. Now, the moment has arrived and as per reports the film would be hitting the screens on May 15. This is the re release poster.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X