»   » శివాయ్: ట్రైలర్ బీభత్సం, విజువల్స్ కేక... (వీడియో)

శివాయ్: ట్రైలర్ బీభత్సం, విజువల్స్ కేక... (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ హీరోగా నటిస్తూ.... స్వయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'శివాయ్'. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజైంది. 3.50 నిమిషాల వ్యవధిగల ట్రైల‌ర్లో సూపర్భంగా ఉంది.

సినిమా ఎక్కువగా మంచు కొండ ప్రాంతాల్లో చిత్రీకించినట్లు స్పష్టం అవుతోంది. శివుడు, హిమాలయాస్ నేపథ్యంలో కథ సాగుతుంది. ట్రైలర్లో విజువల్స్, యాక్షన్ సీన్లు అద్భుతంగా ఉండటంతో సినీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ దీపావ‌ళికి రిలీజ్ కానుంది.

బ‌ల్గేరియాలోని బాల్క‌న్ ప‌ర్వ‌త శ్రేణుల్లో చాలా వ‌ర‌కు షూటింగ్ చేసిన‌ట్లు తెలుస్తోంది . పోలాండ్ న‌టి ఎరికా కార్‌, గిర్నీశ్ క‌ర్నాడ్‌, వీర్ దాస్‌, సైరా బాను కూడా ఈ ఫిల్మ్‌లో న‌టిస్తున్నారు. శివాయ్ ట్రైల‌ర్‌‌‌కు రెస్పాన్స్ కూడా అదిరిపోయే విధంగా ఉంది. ఉత్కంఠ రేపే విధంగా ఉన్న ఈ ట్రైలర్ చూసిన బాలీవుడ్ ప్రముఖులంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరో వైపు ప్రేక్షకుల నుండి కూడా ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆదివారం రిలీజైన ఈ ట్రైలర్‌ను ఒక్కరోజులోనే దాదాపు 20 లక్షల మంది వీక్షించారంటే రెస్పాన్స్ ఏ రేంజిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

స్లైడ్ షోలో ట్రైలర్, మరిన్ని ఆసక్తికర విశేషాలు....

దీపావళి రిలీజ్

దీపావళి రిలీజ్

ఈ దీపావళికి ‘శివాయ్' మూవీని రీలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సాయేషా

సాయేషా

ఈ చిత్రంలో అజయ్ దేవగన్ సరసన అఖిల్ మూవీ ఫేమ్ సయేషా నటిస్తోంది.

ఇంట్రెస్టింగ్ పాయింట్

ఇంట్రెస్టింగ్ పాయింట్

లార్డ్ శివుడి చుట్టూ తిరిగే కథాంశం కావడంతో సినిమా ఇండియన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంటున్నారు.

హిమాలయన్ మౌంటెనీర్

హిమాలయన్ మౌంటెనీర్

ఇందులో అజయ్ దేవగన్ హిమాలయన్ మౌంటెనీర్ గా కనిపించబోతున్నాడు.

అజయ్ దేవగన్

అజయ్ దేవగన్

ఈ సినిమాలో హీరోగా చేస్తూ... దర్శకత్వం వహిస్తూ... భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. అజయ్ దేవగన్ ఈ సినిమా కోసం పడ్డ కష్టం ఏ రేంజిలో ఉందో దీపావళి నాటికి తేలనుంది.

ట్రైలర్

శివాయ్ మూవీ ట్రైలర్ ఇదే..

English summary
Shivaay is a Himalayan mountaineer who is an innocent everyman and yet is capable of TRANSFORMING into a mean DESTROYER when he needs to PROTECT his family. In Theatres on 28th October, 2016.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu