For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షూ వేసుకోని.., శివుడి మీదకెక్కి.. ముదురుతున్న వివాదం... శివాయ్ లో అసలేం జరుగుతోంది..?? (మేకింగ్ ఫొటో

  |

  బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'శివాయ్'. ఈ చిత్రంలో అజయ్ సరసన సాయేషా సైగల్ జంటగా నటిస్తుండగా.. దిలీప్ కుమార్, సైరా భానులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజయ్ దేవగణ్ తన సొంత బ్యానర్ అజయ్ దేవగణ్ ఎఫ్‌ఫిల్మ్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రానికి అజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశలో ఉంది... మొన్న నే విడుదలైన ట్రైలర్ ఇప్పుడొక సంచలనం....

  శివాయ్ ఈ దీపావ‌ళికి రిలీజ్ కానుంది. ఈ ఫిల్మ్‌కు సంబంధించిన ట్రైల‌ర్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. మంచు కొండ‌లు, విదేశీ లొకేష‌న్ల లో ఫిల్మ్‌ను షూట్ చేశారు. అజ‌య్ దేవ‌గ‌నే ఈ ఫిల్మ్‌కు ద‌ర్శ‌క‌, నిర్మాత బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నాడు. ఛేజింగ్‌, యాక్ష‌న్ సీన్లు హాలీవుడ్‌ను మించేశాయి. బ‌ల్గేరియాలోని బాల్క‌న్ ప‌ర్వ‌త శ్రేణుల్లో చాలా వ‌ర‌కు షూటింగ్ చేసిన‌ట్లు తెలుస్తోంది . పోలాండ్ న‌టి ఎరికా కార్‌, గిర్నీశ్ క‌ర్నాడ్‌, వీర్ దాస్‌, సైరా బాను కూడా ఈ ఫిల్మ్‌లో న‌టిస్తున్నారు. శివాయ్ ట్రైల‌ర్‌ పై బాలీవుడ్‌ ట్విట్ట‌ర్‌లో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది.

  హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా సినిమా పోస్టర్ ఉందంటూ అజయ్ దేవగన్ కొత్త సినిమా శివాయ్ పై ఢిల్లీ, తిలక్ నగర్ పోలీ స్టేషన్ లో కేసు నమోదైంది.. ఈ సినిమా కొసం విడుదలైన పోస్టర్లు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయన్నది వారి ఆరోపన... అసలేం జరిగింది... ఇంతకీ అంత నొప్పించే లా ఆపోస్టర్లలో ఏం ఉందీ అంటే.... స్లైడ్ షోలో చూడండి...

  శివాయ్ మ్యానియా

  శివాయ్ మ్యానియా

  రెండురోజులుగా సోషల్ మీడియా శివాయ్ మ్యానియాకి లోనైంది విపరీతంగా షేర్ లు చేస్తూ మళ్ళీ మళ్ళీ ఈ ట్రైలర్ నే చూస్తున్నారు.

  దీపావ‌ళికి రిలీజ్

  దీపావ‌ళికి రిలీజ్

  ఈ దీపావ‌ళికి రిలీజ్ కానుంది. ఈ ఫిల్మ్‌కు సంబంధించిన ట్రైల‌ర్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. మంచు కొండ‌లు, విదేశీ లొకేష‌న్ల లో ఫిల్మ్‌ను షూట్ చేశారు. అజ‌య్ దేవ‌గ‌నే ఈ ఫిల్మ్‌కు ద‌ర్శ‌క‌, నిర్మాత బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నాడు. సినిమా అక్టోబర్ 28న విడుదలకు సిద్ధమైంది.

  ట్విట్ట‌ర్‌లో ప్ర‌శంస‌ల వ‌ర్షం

  ట్విట్ట‌ర్‌లో ప్ర‌శంస‌ల వ‌ర్షం

  బ‌ల్గేరియాలోని బాల్క‌న్ ప‌ర్వ‌త శ్రేణుల్లో చాలా వ‌ర‌కు షూటింగ్ చేసిన‌ట్లు తెలుస్తోంది . పోలాండ్ న‌టి ఎరికా కార్‌, గిర్నీశ్ క‌ర్నాడ్‌, వీర్ దాస్‌, సైరా బాను కూడా ఈ ఫిల్మ్‌లో న‌టిస్తున్నారు. శివాయ్ ట్రైల‌ర్‌ పై బాలీవుడ్‌ ట్విట్ట‌ర్‌లో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది.

  వివాదాలు

  వివాదాలు

  మంచు కొండల మధ్య తాడుతో అజయ్ దేవగణ్ కిందకు వేలాడుతుండగా.. వెనుక హెలికాఫ్టర్, మంచు కొండల్లో శివుడి రూపం.. ఆ పక్కనే దుష్టశక్తులు ఉన్నట్లు రూపొందించిన ఈ పోస్టర్ చిత్రంపై వివాదాలు చెలరేగుతున్నాయి.

  పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

  పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

  చిత్ర పోస్టర్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉందని కొందరు ఢిల్లీలోని తిలక్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

  స్పందన రాలేదు

  స్పందన రాలేదు

  ఇప్పటివరకు ఈ కంప్లైంట్ కి సంబంధించి, శివాయ్ టీం నుండి ఎటువంటి స్పందన రాలేదు.కనీసం అజయ్ దేవ్గన్ ఇప్పటివరకూ ఈ వివాదం వైపు దృష్టి కూడా సారించినట్టులేడు. అతని చూపుమొత్తం సినిమా రిలీజ్ మీదనే ఉంది.

  మంచి టర్న్

  మంచి టర్న్

  ఇక స్టిల్‌లో అజయ్‌దేవగన్ గుండు గీయించుకుని...శరీరంపై బొమ్మలు గీయించుకుని మరో గజనీ స్టైల్లో దర్శనమిస్తున్నాడు. ఈ ఒక్క స్టిల్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తోంది. అజయ్‌కు శివాయ్ మంచి టర్న్ అవుతుందని కూడా చర్చలు జరుగుతున్నాయి.

  బాహుబలి

  బాహుబలి

  గతేడాది బాహుబలి ఇంటర్నేషనల్ గా సృష్టించిన సంచలనాలు ఇంకా మర్చిపోక ముందే.. ఇప్పుడు శివాయ్ ఆ సెన్సేషన్ కి కొనసాగింపునివ్వటానికి రెడీ అయిపోతోంది.

  మీరు ఏదో కోల్పోయినట్లే

  మీరు ఏదో కోల్పోయినట్లే

  దాదాపు 4 నిమిషాల ఉండే లెంగ్తీ ట్రైలర్ లో.. ఒక్క ఫ్రేమ్ మిస్ అయినా.. మీరు ఏదో కోల్పోయినట్లే. మంచుకొండల్లో తీసిన సీన్స్ నుంచి.. యాక్షన్ ఎలిమెంట్స్ వరకూ.. ఇ

  ఎన్నో విచిత్రాలు

  ఎన్నో విచిత్రాలు

  ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్ పై కనిపించని ఎన్నో విచిత్రాలను చేసి చూపించాడు అజయ్ దేవగన్.

  అద్బుతం:

  అద్బుతం:

  అసలు ఓ బాలీవుడ్ మూవీ చూస్తున్నామనే ఫీలింగ్ లేదు. ప్రతీ ఫ్రేం నీ ఒక అద్బుతం లా కనిపించేటట్టే చూసుకున్నాడు అజయ్... అంటేనే ఈ ట్రైలర్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది.

  మలుపుతిప్పే మూవీ:

  మలుపుతిప్పే మూవీ:

  ట్రైలరో ఉన్న ఇదే టెంపో సినిమాలోనూ ఉంటే గనక శివాయ్ మరో మలుపుతిప్పే మూవీ అవుతుందనటం లో అనుమానమే లేదు.

  శివుడిని కాన్సెప్ట్:

  శివుడిని కాన్సెప్ట్:

  లయకారుడు పరమ శివుడి కాన్సెప్ట్ ను తీసుకొని హై ఎండ్ యాక్షన్ -డిస్ట్రాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో తెలుగులో 'అఖిల్' సినిమాలో నటించిన సయేషా సైగల్.. అజయ్ దేవగణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

  చాలా రోజులే అయింది:

  చాలా రోజులే అయింది:

  నిజానికి అజయ్ దేవ్ గన్ ఈ మధ్య కాలంలో పెద్దగా సినిమాలు చేయడంలేదు. క్యారెక్టర్ సెంట్రికే తప్ప, హీరో ఓరియెంటెడ్ మూవీస్ చేయడం మానేసి చాలా రోజులే అయింది. మధ్యలో వచ్చిన సింగం మినహాయింపు, ఐతే వైవిధ్యమైన సినిమాలు చేయడానికే మనోడి ప్రయార్టీ,

  హిందువుల మనోభావాలు:

  హిందువుల మనోభావాలు:

  అలా వస్తున్న సినిమానే శివాయ్. ఫస్ట్ లుక్ రిలీజవగానే ఫ్యాన్స్ ఆత్రంతో చూశారు మంచి హిట్లే పడ్డాయ్ కానీ, ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని కామెంట్లు వస్తున్నాయ్.

  ఆయనపైకి లంఘిస్తున్నట్లుగా:

  ఆయనపైకి లంఘిస్తున్నట్లుగా:

  శివాకారంలో ఓ మనిషి అస్పష్టంగా కన్పిస్తుండగా, ఆయనపైకి లంఘిస్తున్నట్లుగా అజయ్ దేవ్ గన్ కన్పిస్తున్నాడు.

  మెలూహ:

  మెలూహ:

  ఇంకొక పోస్టర్ లో వీపుమీద త్రిషూలం పచ్చబొట్టుతో కనిపిణటం... ఆ మధ్య వచ్చిన శివాట్రయాలజీ లోని "మెలూహ" ముఖ చిత్రాన్ని గుర్తుకు తెస్తోంది.

  ఏ సంబందమూ లేదు:

  ఏ సంబందమూ లేదు:

  అయితే ఆ పుస్తకానికీ తన సినిమాకి ఏ సంబందమూ లేదని మొదట్లోనే స్పష్టం చేసాడు అజయ్.

  బ్రిటిష్ బాలనటి:

  బ్రిటిష్ బాలనటి:

  ‘శివాయ్'లో బ్రిటిష్ బాలనటి ఆబిగైల్ ఈమ్స్ నటించనుంది. ఈ చిత్రంలో తన కూతురి పాత్రను ఆబిగైల్ పోషిస్తోందని అజయ్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఆబిగైల్ ఫొటోను కూడా పోస్ట్ చేశాడు.

  ట్విట్టర్ లో :

  ట్విట్టర్ లో :

  బాలనటిని ఎంపిక చేసేందుకుగాను మనదేశంతో పాటు కెనడా, యూఎస్, యూకే దేశాలలో తిరిగి ఎట్టకేలకు బ్రిటన్ కు చెందిన ఆబిగైల్ ను ఎంపిక చేసినట్లు ట్విట్టర్ లో చెప్పాడు.

  ట్విట్టర్ లో :

  ట్విట్టర్ లో :

  మొత్తంగా ఇదో యాక్షన్ చిత్రంగా మలుస్తున్నాడు అజయ్ దేవగన్. ‘శివాయ్'పై బాలీవుడ్‌లో ట్విట్టర్ లో నెలకొన్నాయి.

  మరి ఆసంగతేమిటో:

  మరి ఆసంగతేమిటో:

  ఒకవేల ఈ సినిమా గనక హిట్ అయితే అజయ్ ఫుల్ టైమ్ దర్శకుడిగా మారాలనే ఆలోచనలో ఉన్నాడట... మరి ఆసంగతేమిటో తెలియాలీ అంటే దీపావలి వరకూ ఆగాల్సిందే.

  ఏ క్లారీటీ లేదట:

  ఏ క్లారీటీ లేదట:

  ఇదే సినిమాని ప్రాంతీయ భాషలైన తెలుగూ..తమిళ్ లో కూదా డబ్ చేయాలని భావించినా ఇంకా ఈ విషయం మీద ఏ క్లారీటీ లేదట....

  హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే:

  హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే:

  కానీ ఈ పోస్టర్లనీ, ఫొతోలనీ చూస్తూంటే మాత్రం మనం ఆశ్చర్యం లో మునిగిపోక తప్పదు. మొత్తానికి అజయ్ దేవగన్ కి ఒక హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

  English summary
  A complaint has been filed against Bollywood actor Ajay Devgn in connection with the poster of his upcoming film 'Shivaay' for allegedly hurting Hindu community's
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X