»   » ‘మా’ ఎలక్షన్స్: అలీ నమ్మక ద్రోహం చేసాడన్న శివాజీ రాజా

‘మా’ ఎలక్షన్స్: అలీ నమ్మక ద్రోహం చేసాడన్న శివాజీ రాజా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజేంద్రప్రసాద్ ప్యానెల్ బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయనకు మద్దతుగా ఉన్న నటుడు శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు చేసారు. అలీ నమ్మక ద్రోహం చేసాడంటూ వ్యాఖ్యానించారు. ‘మా' ఎన్నికల్లో నువ్వు పోటీ చేస్తే నేను పోటీ చేయను...నేను పోటీ చేస్తే నువ్వు పోటీ చేయొద్దు అని ముందే అనుకున్నాం. అలీ పోటీ చేయనని చెప్పిన తర్వాతే నేను నామినేషన్ వేసాడు. అలీ నమ్మక ద్రోహం చేసాడు. అందుకే నేను నామినేషన్ ఉపసంహరించుకున్నాను. ఇలాంటి పరిస్థితి మాకు రావడం మా ఖర్మ అంటూ వ్యాఖ్యానించారు. మా కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నాను. మరో రెండేళ్ల వరకు అసోసియేషన్ మెట్లు కూడా తొక్కను. రాజేంద్రప్రసాద్ అంటే నాకు చాలా ఇష్టం. సేవ చేయాలనే ఉద్దేశ్యం తప్ప వేరే ఉద్దేశ్యం లేదు. అలీ మోసం చేస్తాడని అనుకోలేదని, మంచు లక్ష్మిపై కావాలనే పోటీ పెట్టలేదన్నారు.

నేను ఎవరి బెదిరింపులకు లొంగే రకం కాదు. మా అసోషియేషన్లో చాలా పదవులు చేపట్టాను. మోహన్ బాబు దగ్గర, మురళీ మోమన్ దగ్గర పని చేసారు. చాలా కష్టపడి పని చేసి అసోసియేషన్‌కు నిధుల సేకరణలో తొడ్పడ్డాను. ప్రస్తుతం అసోషియేషన్ ద్వారా పేద కళాకారులకు ఎలాంటి న్యాయం జరుగడం లేదు. కొందరు దుర్మార్గులు ఉన్నారు. చాలా తప్పులు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.

Shivaji Raja about MAA elections

కాదంబరి కిరణ్ మాట్లాడుతూ... ప్రస్తుతం ఉన్న మా అసోసియేషన్ వల్ల పేద కళాకారులకు ఎలాంటి న్యాయం జరుగడం లేదు. అసోసియేషన్‌లో 3 కోట్ల నిధులు ఉన్నా పేద కళాకారులకు సహాయం చేయడంలేదు. గతంలో నాగబాబు ఉన్నపుడు 38 మంది పేద కళాకారుకు పించన్ ఇప్పించారు. ఇపుడు కేవలం ఒకే ఒక్కరికి పించన్ వస్తోంది. మా అసోసియేషన్ మాకు తల్లిలాంటిది. ఆ తల్లికి 700 మందికిపైగా పిల్లలు ఉన్నారు. ఎన్నో ప్రభుత్వ పథకాలు ఉన్నా అవి మా వరకు రానివ్వడం లేదు. ప్రస్తుతం మా అసోసియేషన్లో ఉన్న పెద్దలు ఏసీ రూముల్లో కూర్చొని వారం పబ్బం గడుపుకుంటున్నారు. అందులోకి పేద కళాకారులను రానివ్వడం లేదు అని వ్యాఖ్యానించారు.

English summary
TOllywood actor Shivaji Raja about MAA elections.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu