twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలా అంటే చిరంజీవిని అవమానించడమే... తాగి తప్పు చేసింది నువ్వు: నరేష్ ‘మా’ వివాదంపై శివాజీ రాజా

    |

    Recommended Video

    Shivaji Raja Press Meet : Shivaji Raja Sensational Comments On Naresh | Filmibeat Telugu

    'మా' ఎన్నికల్లో నరేష్ ప్యానల్ గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల ముందు ప్రచారంలో, గెలిచిన తర్వాత కూడా నరేష్ ప్యానల్ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా మీద పలు ఆరోపణలు చేశారు. అమెరికాలో ఫండ్ రైజింగ్ కోసం నిర్వహించిన కార్యక్రమంలో అవకతవకలు జరిగాయి అనేది అందులో ప్రధానంగా చేసిన ఆరోపణ.

    ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన శివాజీ రాజా తనపై చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో గెలుపొందిన నరేష్‌ ప్యానల్ హుందాగా ప్రవర్తించాలని సూచించారు.

    అలా చేస్తే చిరంజీవిగారిని అవమానించినట్లే...

    అలా చేస్తే చిరంజీవిగారిని అవమానించినట్లే...

    అమెరికా చేసిన ఈవెంటులో ఏదో అక్రమాలు జరిగాయని నరేష్ ఎన్నికల్లో ప్రచారం చేశారు. చిరంజీవి లాంటి వ్యక్తి అధ్యక్షతన దగ్గుబాటి సురేష్ బాబు, కెఎల్ నారాయణ, ఇండస్ట్రీలో ఉన్న అందరు పెద్దలు ఈ ఆరోపణలపై కమిటీ వేసి, ఆడిటింగ్ జరిపారు. పైసా కూడా అవినీతి జరుగలేదని తేల్చారు. పైగా రూ. 30 నుంచి 40 లక్షలు అడ్వాన్స్ తీసుకొచ్చి శివాజీ రాజా, శ్రీకాంత్ శ్రీకాంత్ సెట్ చేశారని చెప్పారు. అయినా కూడా నువ్వు అవకతవకలు జరిగాయని చెప్పడం అంటే చిరంజీవి గారిని అవమానించినట్లు కాదా?... అని శివాజీ రాజా ప్రశ్నించారు.

    అపుడు ఈ విషయం గుర్తు రాలేదా?

    అపుడు ఈ విషయం గుర్తు రాలేదా?

    చిరంజీవిగారు లాస్ ఏంజిల్స్ నుంచి డల్లాస్ వరకు ఆయన సొంత డబ్బుతో చార్టెడ్ ఫ్లైట్ తీసుకుని వచ్చారు. మేము ఈ విషయం ఎక్కడా చెప్పలేదు. అందరినీ బిజినెస్ క్లాసులో తీసుకెళ్లారు అవసరమా? అంటూ నరేష్ మరో నింద వేశారు. నరేష్ వేసిన ఈ నిందపై నేను ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. మమ్మల్ని నాజర్‌, విశాల్ వారి నడిగర్ సంఘం కార్యక్రమం మలేషయాలో జరిగితే పిలిచారు. నేను, నరేష్, పరుచూరి వెంకటేశ్వరరావు బిజినెస్ క్లాస్ లోనే వెళ్లాం. మరి నరేష్‌కు అసోసియేషన్ మీద అంత ప్రేమ ఉంటే అపుడు మామూలు క్లాస్ లోనే రావొచ్చుగా?... శివాజీ రాజా వ్యాఖ్యానించారు.

    నువ్వు తాగి అలా చేయడం తప్పుకాదా?

    నువ్వు తాగి అలా చేయడం తప్పుకాదా?

    మలేషియాలో పరుచూరి వెంకటేశ్వరరావు, నేను మామూలు రూములో ఉంటే... అతడు సూట్ రూములో ఉన్నారు. డబ్బు ఖర్చు పెట్టకూడదు అంటన్ననరేష్ మామూలు రూములో ఉండొచ్చు కదా? అది కాకుండా ఇతడు తాగేసి ఫ్లైట్ మిస్సయితే మళ్లీ టిక్కెట్ తీసుకుని వేరే ప్లైటుకు పంపించారు. ఇది తప్పుకాదా? డబ్బు అలా వృధాగా ఖర్చు పెట్టంచడం కరెక్టా?... అని శివాజీ రాజా ప్రశ్నించారు.

    చిన్న విషయాలను బూతద్దంలో పెట్టి చూస్తున్నారు

    చిన్న విషయాలను బూతద్దంలో పెట్టి చూస్తున్నారు

    ఈ మధ్య నువ్వు లండన్, అమెరికా షూటింగులకు వెళ్లినపుడు మామూలు క్లాసులో వెళ్లావా? బిజినెస్ క్లాసులోనే వెళ్లావుకదా. ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడే అనే మంచి తనం మీకు ఉండాలి కదా... అంటూ నరేష్ మీద శివాజీ రాజా సెటైర్లు వేశారు. ఆర్టినరీ క్లాసులో తీసుకుని వెళితే హీరోలు వస్తారా? మీరు రేపు స్టార్‌తో ప్రోగ్రాం చేద్దాం అంటున్నారు కదా... మామూలు క్లాసులో తీసుకెళ్లితే ఎవరైనా హీరోలు వస్తారా? ఎవరూ రారు. చిన్న చిన్న విషయాలు బూతద్దంలో పెట్టి చూడటం ద్వారా ఒక వ్యక్తిని బాధ పెట్టడం తప్ప ఏమీ లేదని శివాజీ రాజా అన్నారు.

    నాకు అంత ఆస్తి ఉంటే నేనే డబ్బు ఇచ్చేవాడిని

    నాకు అంత ఆస్తి ఉంటే నేనే డబ్బు ఇచ్చేవాడిని

    మీరు ఇలా చుట్టూ నెగెటివ్‌స్ప్రెడ్ చేసి మనశ్శాంతిగా పని చేసుకోగలరా? దయచేసి ఇలాంటివి చేయొద్దు. పాజిటివ్‌గా ఉండండి. మంచి పేరు తెచ్చుకోండి. రెండున్నకోట్లు ఉన్న ‘మా' ఫండ్ శివాజీ రూ. 5 కోట్లు చేశారు... నేను పది కోట్లు చేయాలనే కసితో పని చేయండి. మీకు రింగ్ రోడ్డు దగ్గర ఉన్న రూ. 600 కోట్ల ఆస్తి గురించి గొప్పగా చెప్పుకుంటారుకదా... నాకు నిజంగా అంత ఆస్తి ఉంటే 6 కోట్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ఇచ్చి ఫిల్మ్ నగర్లోనే భవనం కట్టేవాడిని... అని శివాజీ రాజా తెలిపారు.

    నువ్వు ఒక్కపైసా ఇచ్చావా?

    నువ్వు ఒక్కపైసా ఇచ్చావా?

    ఈ రెండేళ్లలో జనరల్ సెక్రటరీగా ఉన్న నరేష్ ఒక్క పైసా అయినా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ఇచ్చారా? మాట్లాడితే మా మదర్ 15 వేలు ఇచ్చారని చెబుతున్నారు. ఆమె సేవా పరురాలని, గొప్ప వ్యక్తి అని ప్రతి ప్రెస్ మీట్లోనూ నేను చెబుతూనే ఉంటాను. కానీ 15 వేలతోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నడుస్తుందా? అని శివాజీ రాజా ప్రశ్నించారు.

    English summary
    Shivaji Raja counter to MAA new president Naresh about controversial comments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X