»   » ఆయన ఆలింగనంతో 4 రోజులు స్నానం చేయలేదు!

ఆయన ఆలింగనంతో 4 రోజులు స్నానం చేయలేదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కిల్లింగ్ వీరప్పన్' మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కర్ణాటక చలన చిత్ర అకాడమీ బెంగులూరులో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

తన తండ్రి రాజ్ కుమార్ అడుగు జాడల్లోనే కెరీర్లో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. చిన్న, పెద్ద తేడా లేకుండా భవిష్యత్తులో కన్నడలో అందరూ హీరోలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తాను చిన్నతనం నుండి స్టార్ కొడుకుతా ఎప్పుడూ పెరగలేదని, సాధారణ పిల్లాడిగానే పెరిగానని చెప్పారు. నటుడిని కాకపోతే దేశం తరుపున ఆడి మంచి క్రికెటర్ అయుండే వాడిని అన్నారు.

Shivarajkumar was a great fan of Kamal Hassan

విలక్షణ నటుడు కమల్ హాసన్ అంటే తనకు ఎంతో అభినమానం. ఆయన ఓసారి నన్ను ఆలింగనంచేసుకున్నారు. ఆ సంతోషంలో ఆయన హత్తుకున్న పరిమిళం వీడిపోవడం ఇష్టం లేక నాలుగు రోజులు స్నానం చేయలేదన్నారు.

కిల్లింగ్ వీరప్పన్ వివరాల్లోకి వెళితే....
గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను మట్టుబెట్టడానికి పోలీసులు ఎలాంటి వ్యూహాలు అనుసరించారు అనే విషయాలను వెల్లడిస్తూ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కిల్లింగ్ వీరప్పన్'. డిసెంబర్ 4న తెలుగు, కన్నడం, తమిళంలో విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు. సందీప్‌ భరద్వాజ్‌, శివరాజ్‌ కుమార్‌, రాక్‌లైన్‌ వెంకటేష్‌, పరుల్‌ యాదవ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. బి.వి.మంజునాథ్‌, ఇ.శివప్రకాష్‌, బి.ఎస్‌.సుధీంద్ర నిర్మాతలు.

English summary
Shivarajkumar Admitting that he was a great fan of Kamal Hassan, Shivarajkumar said that he did not bathe for four days after Kamal Hassan hugged him. “I didn’t want the warmth to be washed away,” he smiled.
Please Wait while comments are loading...