»   » ‘బాహుబలి’ నిర్మాత రిక్వెస్ట్ వల్లే మహేష్ బాబు కూల్...

‘బాహుబలి’ నిర్మాత రిక్వెస్ట్ వల్లే మహేష్ బాబు కూల్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘శ్రీమంతుడు' సినిమా విడుదల జులై 17న నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాను ఆగస్టు 7కు వాయిదా వేసారు. దీంతో పలు పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. బాహుబలి ప్రభంజనానికి భయపడే మహేష్ బాబు సినిమా వాయిదా వేసారని కొందరు ప్రచారం మొదలు పెట్టారు.

ఈ నేపథ్యంలో ‘బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ ఈ పుకార్లకు తెర దించుతూ ట్విట్టర్లో ప్రకటన చేసారు. కొన్ని రోజుల క్రితం ‘శ్రీమంతుడు' నిర్మాతలను సంప్రదించాం. వీలయితే సినిమా వాయిదా వేయాలని రిక్వెస్ట్ చేసాం. మా విన్నపాన్ని వారు అర్థం చేసుకున్నారు. సినీ పరిశ్రమలో హెల్తీ రిలేషన్ మెయింటేన్ చేస్తున్నారు. మహేష్ బాబుతో పాటు శ్రీమంతుడు నిర్మాతలకు, దర్శకుడికి థాంక్స్' అంటూ ట్వీట్ చేసారు.ఆగష్టు 7న ‘శ్రీమంతుడు' సినిమాని రిలీజ్ చెయ్యడానికి డేట్ ని లాక్ చేసారు. మహేష్ బాబు పుట్టిన రోజు ఆగష్టు 9. అంటే పుట్టిన రోజుకు రెండు రోజులు ముందుగానే కానుక వచ్చేస్తుందన్నమాట. అలాగే ఆడియోని జూలై 18న రిలీజ్ చేయనున్నట్లు ఈ చిత్ర టీం అధికారికంగా తెలియజేసింది.


ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. జూన్ 27కి షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేయనున్నారు. దానికోసమే అన్ని కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మరోప్రక్క ‘శ్రీమంతుడు' కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. మరో ప్రక్క ఈ చిత్రం ఆడియో విడుదల కోసం సైతం ఫ్యాన్స్ ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఆడియో సాంగ్ లీకైందనే వార్త అందరినీ కలవరపరిచింది.


 Shobu Yarlagadda about Srimanthudu

అయితే ఈ విషయమై ఈ చిత్రం నిర్మాతలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ ద్వారా వివరణ ఇచ్చారు. వారు పోస్ట్ చేస్తూ... శ్రీమంతుడు పాట లీకైందని తెలిసింది.అయితే మా సినిమాలో ది మాత్రం కాదన్నారు. మరో ప్రక్క తాజాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని భారీ మొత్తానికి జీ తెలుగు వారు సొంతం చేసుకున్నారు. మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ, సనమ్ శెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు.


English summary
"I met Srimanthudu producers some time back n explained our situation. I requested them to consider moving their release date if possible. We thank #Srimanthudu Producers, Director and Mahesh Babu for understanding and maintaining a healthy relationship in the industry." Shobu Yarlagadda said.
Please Wait while comments are loading...