»   » శ్రీహరి డెత్ : షాకింగ్ విషయాలు బయట పెట్టిన భార్య!

శ్రీహరి డెత్ : షాకింగ్ విషయాలు బయట పెట్టిన భార్య!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా నటుడు శ్రీహరి ఇటీవల హఠాన్మరణం చెందడం అందరినీ షాక్‌కు గురి చేసిన సంగతి తెలిసిందే. అయితే శ్రీహరి మరణం వెనక తాజాగా పలు షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. డాక్టర్లు సరైన వైద్యం అందించి ఉంటే ఆయన బ్రతికి ఉండే వారని, వైద్యులు తప్పుడు వైద్యం అందించడం వల్లనే వల్లనే మరణించారని శ్రీహరి భార్య డిస్కో శాంతి అనుమానిస్తున్నారు.

రాంబో రాజ్ కుమార్ షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లిన ఆయన అస్వస్థతకు గురి కావడంతో దగ్గర్లోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. 'ఆసుపత్రికి తీసుకెళ్లిన వెంటనే ఆయన్ను ప్రాథమికంగా పరీక్షించిన వైద్యులు పెద్దగా ప్రమాదం ఉండదని చెప్పారు. కానీ ఉన్నట్టుండి హడావుడిగా ఐసియుకి తరలించారు. దాదాపు పది మంది వైద్యులు అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారిగా శ్రీహరి అరవడం మొదలు పెట్టారు. నేను వెంటనే లోనికి వెళ్లాను. ఆయన మరణించినట్లు వైద్యులు చెప్పారు' అని శాంతి తెలిపారు.

వైద్యుల తప్పుడు ట్రీట్‌మెంట్ వల్లనే ఇలా జరిగిందనే అనుమానం వచ్చింది. కానీ బావ పోయిన బాధలో వారిని ఏమీ అనలేక పోయా....అప్పుడు ఏం చేసినా ఆయన తిరిగి రాడనే మిన్నకుండి పోయాను అని డిస్కో శాంతి తెలిపారు. మరో వైపు శ్రీహరి పర్సనల్ డాక్టర్ కూడా తప్పుడు వైద్యం జరిగినట్లు అనుమానిస్తున్నారు. స్లైడ్ షోలో పర్సనల్ డాక్టర్ చెప్పిన వివరాలు.

శ్రీహరి పర్సనల్ డాక్టర్ అనుమానం?

శ్రీహరి పర్సనల్ డాక్టర్ అనుమానం?


శ్రీహరికి లివర్ సిరోసిన్ అనే వ్యాది గత రెండు సంవత్సరాలుగా ఉందని శ్రీహరి పర్సనల్ డాక్టర్ మదాల రవి తెలిపారు. ఇటువంటి వ్యాధి ఉన్న వాళ్ళకి వైద్యం చేసేడప్పుడు గత కేసు హిస్టరీ దృష్టిలో పెట్టుకుని వైద్యం చేయాలనీ, కానీ శ్రీహరికి ఉన్న అనారోగ్యం దృష్టిలో పెట్టుకోకుండా ముంబాయి లీలావతి హాస్పటల్ వాళ్ళు వైద్యం చేసి ఉంటారు అన్న అనుమానాన్ని డాక్టర్ మాదాల రవి వ్యక్త పరిచారు.

శ్రీహరి పట్టించుకోలేదా?

శ్రీహరి పట్టించుకోలేదా?


శ్రీహరి కి ఈ వ్యాది వచ్చింది అని తెలిసిన తరువాత అవుట్ డోర్ షూటింగ్స్ తగ్గించుకోమని తాను సలహా ఇచ్చాను అని కూడా మాదాల రవి చెప్పారు.

అదే రియాక్షన్ ఇచ్చిందా?

అదే రియాక్షన్ ఇచ్చిందా?


ముంబాయి లో ‘రాంబో రాజ్ కుమార్' సినిమా షూటింగ్ లో ఉన్న శ్రీహరికి విపరీతమైన ఒళ్ళు నొప్పులు వచ్చినప్పుడు ఒక డాక్టర్ ఇచ్చిన పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ శ్రీహరికి రియాక్షన్ ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు.

అక్కడ సమయం వృధా చేయడం వల్లనే?

అక్కడ సమయం వృధా చేయడం వల్లనే?


పెయిన్ కిల్లర్ రియాక్షన్ ఇవ్వడంతో వెనువెంటనే లీలావతీ హాస్పటల్ కి తీసుకు వెళ్ళినా అక్కడ ఉన్న డాక్టర్లు వెంటనే వైద్యం అందించ కుండా రకరకాల వైద్య పరీక్షలతో సమయాన్ని వృధా చేసారు అని అన్నారు. ఈ ఆలస్యం శ్రీహారి మరణానికి కారణంగా మారి ఉండవచ్చనీ డాక్టర్ మాదాల రవి అభిప్రాయపడ్డారు.

అసమయంలో క్రోసిన్ కూడా ప్రమాదమే..

అసమయంలో క్రోసిన్ కూడా ప్రమాదమే..


శ్రీహరికి ఉన్న అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా క్రోసిన్ టేబ్లేట్ ఇచ్చిన అది ప్రాణాంతకంగా మారుతుంది డాక్టర్ మాదాల రవి అని తెలిపారు.

English summary
Srihari wide Shanti revealed shocking facts about the death of Srihari. She felt her husband wouldn’t have died if he was offered proper treatment.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu