»   » పలువురు హీరోలతో మాధురీ దీక్షిత్ అఫైర్లు.. ఒడిలో పడుకొనేది.. గుట్టువిప్పిన మేనేజర్

పలువురు హీరోలతో మాధురీ దీక్షిత్ అఫైర్లు.. ఒడిలో పడుకొనేది.. గుట్టువిప్పిన మేనేజర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అందాల తార మాధురీ దీక్షిత్ ఓ ప్రత్యేకమైన స్థానం. అందం, అభినయంలో మధుబాల, నర్గీస్, ఇతర నటీమణులుకు ఏ మాత్రం తీసిపోదు. 80, 90 దశకాల్లో మాధురీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. తేజాబ్‌లో ఏక్, దో, తీన్, బేటా చిత్రంలో దక్ దక్ కర్నే లగా అనే పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. దాదాపు 20 ఏళ్ల నటజీవితంలో మాధురీ దీక్షిత్‌కు తాను నటించిన హీరోలు సంజయ్ దత్, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ తదితర నటులతో అఫైర్ ఉందంటూ వార్తలు వచ్చాయి. మాధురీ దీక్షిత్ అఫైర్లకు సంబంధించిన నిజానిజాలను ఆమె మేనేజర్ రింకు రాకేష్ నాథ్ ఇటీవల మీడియాకు వెల్లడించారు.

హీరోలతో అఫైర్లు అంటూ వార్తలు..

హీరోలతో అఫైర్లు అంటూ వార్తలు..

బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్‌తో వరుసగా నాలుగు చిత్రాల్లో నటించారు. ఆ సమయంలో వారి మధ్య రొమాన్స్‌పై మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. సినిమా గురించి క్రేజ్ పెరుగాలంటే ఇలాంటి వార్తలు సృష్టించడ బాలీవుడ్‌లో సహజం. సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, మిథున్ చక్రవర్తితో మాధురీ ప్రేమాయణం అంతా కట్టుకథలే. అవి కొందరు నిర్మాతలు సృష్టించిన రూమార్లు మాత్రమే అని రాకేష్ నాథ్ వెల్లడించారు.

అవన్నీ అవాస్తవాలే..

అవన్నీ అవాస్తవాలే..

మాధురీ దీక్షిత్‌కు మిథున్, జాకీ ష్రాఫ్‌తో అఫైర్ ఉందంటూ వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలే. అలాగే సంజయ్ దత్ వ్యవహారంలో కూడా నిజం లేదు. అందంతా సినిమా ప్రమోషన్ కోసం చేసిన బిజినెస్ స్ట్రాటెజీ. ఆ సమయంలో సంజయ్‌తో మాధురీ సుమారు ఆరు చిత్రాల్లో నటించేది. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ హిట్స్ కావడం విశేషం.

అనిల్ కపూర్‌కు ఇష్టం లేదు..

అనిల్ కపూర్‌కు ఇష్టం లేదు..

తేజాబ్ చిత్రంలో మాధురీ తీసుకోవడంపై అనిల్ కపూర్‌కు మొదట్లో ఇష్టం లేదట. తేజాబ్‌ చిత్రానికి ముందు మాధురీ అబోధ్ అనే చిత్రంలో నటించింది. ఆమె విషయాన్నినిర్మాతలు అనిల్ దృష్టికి తీసుకురాగా.. మాధురీ చూడటానికి చాలా అందంగా ఉంది. కానీ క్యాబరే డ్యాన్సర్ గా కనిపించడం లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆ సమయంలో మాధురీకి ఆడిషన్ నిర్వహించగా.. ఆమె చేసిన ఫెర్ఫార్మెన్స్‌కు దిమ్మ తిరిగింది. దాంతో తేజాబ్‌లో మోహిని పాత్ర దక్కింది.

మేడమ్ అంటూ వినయంగా..

మేడమ్ అంటూ వినయంగా..

మాధురీ ఓవర్‌నైట్‌లో స్టార్‌గా మారలేదు. ఆమె టాప్ హీరోయిన్‌గా మారడానికి నిరంతరం కృషి చేసింది. మాధురి నటించిన సినిమాలు హిట్ అవుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల ఉండేవారు మేడమ్ అంటూ వినయాన్ని ప్రదర్శించేవారు. అగ్రతార హోదాను సంపాదించుకున్నప్పటికీ.. ఆమె మొదట్లో ఎలా ఉండేదో అలానే ఉండేది. పొగరు, అహంకారం తలకు ఎక్కించుకోలేదు.

సాధారణ జీవితం..

సాధారణ జీవితం..

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిన తర్వాత తన సహజమైన జీవితాన్ని గడిపే అలవాటును మానుకోలేదు. స్వయంగా షాపింగ్‌కు వెళ్లేది. ఆమె చెల్లెళ్లు భారతీ, రూపాతో కలిసి హోటల్స్‌కు వెళ్లేది. సరదాగా జీవితం గడపడమంటే మాధురీకి చాలా ఇష్టం. తల్లిదండ్రులు చాలా గారాబంగా పెంచేవారు. ఆమె తల్లి ఒడిలో నిద్రపోయేవారు. వంట ఇంట్లోకి వెళ్లి మంచి ఆహారాన్ని తయారు చేసేంది. ఇప్పటికి కిచెన్‌లో దూరి వంట చేయడమంటే మాధురీకి చాలా ఇష్టం.

శుభలగ్నం చిత్రంలోని..

శుభలగ్నం చిత్రంలోని..

తెలుగులో విజయవంతమైన శుభలగ్నం చిత్రాన్ని హిందీలో జుదాయి సినిమాగా తెరకెక్కించారు. ఆ చిత్రంలో ఉర్మిలా పోషించిన పాత్రను ముందుగా మాధురీకే వచ్చింది. కానీ అయితే అలాంటి పాత్రను పోషించడం లేక వదులుకొన్నది. షారుక్ నటించిన వీర్‌జారా చిత్రంలో ప్రీతిజింటా పోషించిన పాత్ర కోసం ముందుగా మాధురీనే తీసుకోవాలనుకొన్నారు. అప్పటికే వివాహం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న ఆమె ఆ చిత్రాన్ని వదులుకొన్నది అని అప్పటి మేనేజర్ రాకేశ్ నాథ్ చెప్పారు.

English summary
In a recent interview, Madhuri Dixit's ex manager Rinku Rakesh Nath revealed that her scandals involving Sanjay Dutt, Jackie Shroff and Mithun Chakraborty. Nath revealed that Madhuri's scandals involving Sanjay Dutt, Jackie Shroff and Mithun Chakraborty were pure fabrications.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu