»   » ఎవర్‌‍గ్రీన్ గ్రేట్ మూవీ ‘షోలే’కు 40 ఏళ్లు

ఎవర్‌‍గ్రీన్ గ్రేట్ మూవీ ‘షోలే’కు 40 ఏళ్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

భారతీయ సినీ చరిత్రలో ఎవర్ గ్రీన్ గ్రేట్ మూవీగా చరిత్రకెక్కిన సినిమా 'షోలే". ఆగస్టు 15, 9175 లో విడుదలైన ఈ సినిమా ఆగస్టు 15తో 40 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. ఈ సినిమాను జి.పి. సిప్పి నిర్మించగా....అతని కుమారుడు రమేష్ సిప్పి దర్శకత్వం వహించారు. ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, హేమా మాలిని, సంజీవ్ కుమార్, జయ బాధురి, అమ్జద్ ఖాన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. అమితాబ్ లాంటి స్టార్స్ పరిశ్రమలో సెటిలయ్యే అవకాశం కల్పించిన చిత్రం ఇదే.

ఇప్పటి వరకు షోలేను తలదన్నే సినిమా రాలేదంటే అతిశయో‌‍క్తి కాదేమో. 36 ఏళ్ల కిందటే రూ. 3 కోట్లు వెచ్చించి భారీ తారాగణంతో నిర్మించారు. అప్పట్లో మూడు కోట్లంటే భారీ బడ్జెట్. రెండున్నర సంవత్సరాల ఎన్నోకష్టాలకు ఓర్చి షోలేనే తెరకెక్కించారు. తొలుత సినిమా విడుదలైన మొదటి రెండు వారాల్లో సినిమా చూసేందుకు జనాలు పెద్దగా రాక పోవడంతో సినిమా ప్లాప్ అని అంతా నిరుత్సాహ పడ్డారు. ఆ తర్వాత షోలే ప్రభంజనం మొదలైంది. ముంబైలోని మినర్వా థియేటర్ లో షోలే ఏకంగా 286 వారాలు(5 సంవత్సరాలపైనే) నడిచి రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా 100కుపైగా థియేటర్లలో ఏకథాటిగా 25వారాలు(సిల్వర్‌జూబ్లీ) ప్రదర్శితమైంది.

'Sholay' movies Celebrating 40 Years

ఆ తర్వాత ఈ సినిమాను 3డిలో కూడా విడుదల చేసారు. 40 ఏళ్ల క్రితం రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సినిమా ఇప్పటి వరకు వివిధ రూపాల్లో దాదాపు రూ. 768 కోట్లకు పైగా వసూలు చేసినట్ల అంచనా.

షోలేను అనుసరిస్తూ చాలా సినిమాలు వచ్చినా ....అవి నిలవలేక పోయాయి. షోలే చిత్రీకరణ, సన్నివేశాలు, పాత్రల ఎంపిక, పాటలు, సంగీతం అన్ని భిన్నంగా, ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండటం సినిమా ప్లస్సయింది. అంతుకే అప్పటికీ ఇప్పటికే...భారతీయ సినీ ప్రపంచంలో ది గ్రేట్ మూవీ ఓన్లీ 'షోలే" అంటుంటారు సీని ప్రేమికులు.

English summary
'Sholay' movies Celebrating 40 Years. It is considered among the greatest films in the history of Indian cinema. Released on 15 August 1975.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu