»   » గబ్బర్‌సింగ్ ఫ్యాన్స్‌కు శుభవార్త, 3Dలో ‘షోలే’

గబ్బర్‌సింగ్ ఫ్యాన్స్‌కు శుభవార్త, 3Dలో ‘షోలే’

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  ముంబై : బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హిట్ మూవీ 'షోలే' అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆ చిత్రంలోని విలన్ పాత్ర 'గబ్బర్ సింగ్'. అమ్జద్ ఖాన్ పోషించిన ఈ చిత్ర సినిమాకే హైలెట్. ఆ పాత్రకు ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు. త్వరలో ఈచిత్రం 3D ఫార్మాట్లో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు మొదలయ్యాయట. దాదాపు 150 మంది టెక్నీషియన్స్ ఇందుకోసం పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

  ఆగస్టు 15, 9175 లో విడుదలైన ఈ సినిమాను జి.పి. సిప్పి నిర్మించగా....అతని కుమారుడు రమేష్ సిప్పి దర్శకత్వం వహించారు. ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, హేమా మాలిని, సంజీవ్ కుమార్, జయ బాధురి, అమ్జద్ ఖాన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. అమితాబ్ లాంటి స్టార్స్ పరిశ్రమలో సెటిలయ్యే అవకాశం కల్పించిన చిత్రం ఇదే.

  ఇప్పటి వరకు షోలేను తలదన్నే సినిమా రాలేదంటే అతిశయో‌‍క్తి కాదేమో. 38 ఏళ్ల కిందటే రూ. 3కోట్లు వెచ్చించి భారీ తారాగణంతో నిర్మించారు. అప్పట్లో మూడు కోట్లంటే భారీ బడ్జెట్. రెండున్నర సంవత్సరాల పాటు ఎన్నోకష్టాలకు ఓర్చి షోలేనే తెరకెక్కించారు. తొలుత సినిమా విడుదలైన మొదటి రెండు వారాల్లో సినిమా చూసేందుకు జనాలు పెద్దగా రాక పోవడంతో సినిమా ప్లాప్ అని అంతా నిరుత్సాహ పడ్డారట.

  ఆ తర్వాత షోలే ప్రభంజనం మొదలైంది. ముంబైలోని మినర్వా థియేటర్ లో షోలే ఏకంగా 286 వారాలు(5 సంవత్సరాలపైనే) నడిచి రికార్డు సృష్టించింది. షోలేను అనుసరిస్తూ చాలా సినిమాలు వచ్చినా ....అవి నిలవలేక పోయాయి. షోలే చిత్రీకరణ, సన్నివేశాలు, పాత్రల ఎంపిక, పాటలు, సంగీతం అన్ని భిన్నంగా, ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండటం సినిమా ప్లస్సయింది. అందుకే అప్పటికీ ఇప్పటికీ..బాలీవుడ్ సినీ ప్రపంచంలో ది గ్రేట్ మూవీ ఓన్లీ 'షోలే" అంటుంటారు సీని ప్రేమికులు.

  English summary
  
 The 3D version of 1975 super-hit Sholay is all set to hit the theatres. A source revealed that 150 technicians had painstakingly worked for over a year for the new avatar and there were plans to hold screening for the veterans Amitabh Bachchan and Dharmendra. With Sholay being a classic, the 3D factor adds to the excitement.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more