»   » మతాచారాల గొడవే.., ఆగ్రహంతో దువ్వాడ జగన్నాథం షూటింగ్ ఆపేసిన స్థానికులు

మతాచారాల గొడవే.., ఆగ్రహంతో దువ్వాడ జగన్నాథం షూటింగ్ ఆపేసిన స్థానికులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

దువ్వాడ జగన్నాథం సినిమాకీ మొదటి దెబ్బ పడింది. మనోభావాలు లాంటి సమస్యలు ముందునుంచే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఇప్పుడు ఇంకఓ రకంగా బన్నీ సినిమాకి అడ్డు తగిలినట్తయ్యింది. ఇప్పుడు వచ్చిన సమస్య మరీ లోతైన విషయం శైవ-వైష్ణవ తేడాలని చూపుతూ వచ్చింది. హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న డీజే-దువ్వాడ జగన్నాదం సినిమాలో బన్నీ బ్రాహ్మణ యువకుడిగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే .

Shoot of Telugu film Duvvada Jagannadham stalled

సినిమా షూటింగ్ కోసం కర్ణాటక హాసన జిల్లా బేలూరు చెన్నకేశవ ఆలయంలో శివాలయం, శివలింగం సెట్లను వేశారు. అదే వివాదాన్ని రాజేసింది. చెన్నకేశవుడంటే విష్ణుమూర్తి రూపాలలో ఒకరు కాబట్టి వైష్ణవ ఆలయంలో శైవాచారానికి సంబంధించిన సెట్లను ఎలా వేస్తారంటూ స్థానికులు అక్కడకు వచ్చి షూటింగ్‌ను అడ్డుకున్నారు. షూటింగ్‌ను నిలిపివేయాలంటూ డిమాండ్ చేసి నిరసన వ్యక్తం చేశారు.


అయితే సెట్లను వేయడమే ఒక సమస్య అవలేదు షూటింగ్ పేరుతో యూనిట్ సభ్యుల ప్రవర్తన కూడా ఆలయ సిబ్బందికీ, అక్కడికి వచ్చే భక్తులకూ చిరాకు తెప్పించే విధంగా ఉండటం కూడా ఒక కారణం. ఈ చారిత్రక ఆలయంలోకి షూటింగ్ పేరిట భక్తులను ఎలా నిలువరిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Shoot of Telugu film Duvvada Jagannadham stalled

అయితే.. తాము దేవాదాయ శాఖ నుంచి అనుమతులు తెచ్చుకున్నామని, రోజుకు రూ.1.5 లక్షలు చెల్లించి షూటింగ్ చేసుకుంటున్నామని ఆందోళనకారులకు చిత్ర దర్శక-నిర్మాతలు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. వారు వినిపించుకోలేదు. వైష్ణవ ఆలయంలో శైవాచారానికి సంబంధించిన సెట్లను వేయడం, భక్తులను అనుమతించకపోవడం సరికాదని స్థానికులు నిరసన వ్యక్తం చేశారు.


కాగా, వారం రోజులుగా దైవానికి పూజలను కూడా సరిగ్గా నిర్వహించలేకపోతున్నామని ఆలయ ప్రధానార్చకులు కృష్ణ భట్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చిత్ర దర్శక, నిర్మాతలు షూటింగ్‌ను కాసేపు నిలిపివేశారు. మరి రేపటినుంచీ షూటింగ్ సరిగ్గా జరుగుతుందా లేదా అన్నవిషయం తెలియాల్సి ఉంది.

English summary
The crew of the Telugu film, Duvvada Jagannadham, that has been shooting on the premises of the Beluru Chennakeshava Temple in Belur, ran into trouble on set on Thursday evening, as protesters stalled the shoot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu