»   » సెక్సీ హీరోయిన్ కి మళ్ళీ ఆఫరిచ్చాడు: డైరెక్టర్ కి ఆమె సెంటిమెంటా?

సెక్సీ హీరోయిన్ కి మళ్ళీ ఆఫరిచ్చాడు: డైరెక్టర్ కి ఆమె సెంటిమెంటా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రద్దా దాస్ దాదాపు పదేళ్ళుగా సినిమాల్లో ఒక బ్రేక్ కోసం చూస్తూనే ఉంది. ఆర్య 2, డార్లింగ్ లాంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు తప్ప మెయిన్ రోల్స్ లో నిలబడేంత పెద్ద గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. అలా కెరీర్ ని నిలబెట్టుకోవటానికి తాపత్రయపడుతున్న సమయం లోనే దర్శకుడు ప్రవీణ సత్తారు కొన్నాళ్ల క్రితం గుంటూరు టాకీస్ అనే సినిమా తీసాడు. అదులో బుల్లెట్ రాణి అనే పాత్రకోసం మంచి ఫిగర్ ఉన్న నటి కావాల్సి వచ్చింది.

బుల్లెట్ రాణి

బుల్లెట్ రాణి

అవకాశాల్లేని శ్రద్దా దాస్ కి అదే పెద్ద చాన్స్ అన్నట్టు ఆమెకి ఆఫర్ ఇవ్వగానే వచ్చేసింది. అయితే ఏదో ఐటం గర్ల్ లాంటి క్యారెక్టర్ కాకుండా మాంచి రఫ్ గా ఉండే పాత్రనే ఇచ్చాడు ప్రవీణ్ ఆ అవకాశాన్ని వృహ చేసుకోలేదు. ఆమె గెటప్, మగాడ్ని మంచానికి కట్టేసి మరీ మీద దూకే క్యారెక్టరైజేషన్, కలిసి ఆ సినిమాలో శ్రద్ధను బాగా ఎలివేట్ చేసాయి.

గుంటూర్ టాకీస్

గుంటూర్ టాకీస్

ఒక రకంగా గుంటూర్ టాకీస్ కి ఆమె మంచి బ్యాకప్ అయ్యింది. సినిమాకి ప్లస్ పాయింట్లలో రశ్మి తో సమానం గా శ్రద్దా కూడా ఒకరు. అందుకే ఇప్పుడు మళ్లీ తన సినిమాలో శ్రద్ధకు మరో మాంచి పాత్ర ఆపర్ చేసాడు ప్రవీణ్ సత్తారు. రాజశేఖర్ హీరోగా నిర్మిస్తున్న గరుడవేగ చిత్రంలో శ్రద్ద జర్నలిస్ట్ గా కనిపించబోతోంది.

డైనమిక్ టీవీ రిపోర్టర్ గా

డైనమిక్ టీవీ రిపోర్టర్ గా

రాజశేఖర్ హీరోగా, కిషోర్ విలన్ గా, పూజా కుమార్ ఓ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఎప్పటికైనా టాప్ జర్నలిస్ట్ కావాలనుకునే పాత్రలో శ్రద్ధ నటిస్తోంది.ఈ సినిమాలో డైనమిక్ టీవీ రిపోర్టర్ గా నటిస్తోంది. నిజ జీవితం లో జర్నలిజం చదివిన శ్రద్దా ఇప్పుడు సినిమాలో జర్నలిస్ట్ గా కనిపించటం పై బాగా శ్రద్దగా పని చేస్తున్నట్టుంది.

హాలీవుడ్ యాక్ష‌న్ చిత్రాల‌కు ధీటుగా

హాలీవుడ్ యాక్ష‌న్ చిత్రాల‌కు ధీటుగా

రష్య‌న్ స్టంట్ మాన్ డేవిడ్ ఖుబు, థాయిలాండ్ స్టంట్ మాన్ నుంగ్, మరియు ఇండియన్ స్టంట్ మాస్టర్ సతీష్ నేతృత్వం లో, జార్జియా, బ్యాంకాక్, మలేషియా, పట్టాయ, సింగపూర్, ముంబై వంటి ప్రదేశాల్లో యాక్ష‌న్ సీన్స్‌, చేజ్ సీక్వెన్స్‌ల‌ను హాలీవుడ్ యాక్ష‌న్ చిత్రాల‌కు ధీటుగా ఈ సినిమాలో రూపొందిస్తున్నారు.

సన్నీ లియోన్

సన్నీ లియోన్

అలాగే బాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ విష్ణుదేవా కంపోజిష‌న్‌లో ముంబై లో వేసిన భారి సెట్ లో సన్నీ లియోన్ తో చేసిన ఐటెం సాంగ్ మ‌రో హైలైట్ అవుతుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా హైద‌రాబాద్‌లో ఫైన‌ల్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. రాజశేఖర్ కి ఇప్పుడున్న మార్కెట్ కంటే కూడా ఎక్కువే డబ్బు పెట్టి మరీ ఈ సినిమా ని తేరకెక్కిస్తూండటం. బయట టాక్ కూడా పాజిటివ్ గా ఉందటం వల్ల ఈ సినిమా తో అయినా తనకు ఓ బ్రేక్ వస్తుందనే ఆశతోనే ఉంది శ్రద్ద.

English summary
Sradda Das Revealing more about her character, the makers of ‘PSV Garuda Vega’ said that she will be playing the role of a journo named Malini in this one.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu