»   » అక్కడ లైవ్ లో స్టెప్పులు, వెంటనే న్యూస్ రీడింగ్, "శ్రద్ద"గా కష్టపడుతోంది

అక్కడ లైవ్ లో స్టెప్పులు, వెంటనే న్యూస్ రీడింగ్, "శ్రద్ద"గా కష్టపడుతోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

పెద్ద పారిశ్రామిక వేత్తల ఇంట్లో పెళ్ళి జరిగినప్పుడు సంగీత్ లో బాలీవుడ్ తారలతో డాన్స్ చేయించటం ఒక ప్రెస్టేజ్ సింబల్ గా ఉండేది. ఇలాంటి సాంప్రదాయం నార్త్ లో ఎక్కువ కనిపించేది, షారూఖ్ ఖాన్, జూహీ చావ్లా, మాధురీ దీక్షిత్ ఇలా ఇంకొంతమంది ఈ ఫక్షన్లలో డాన్స్ చేసినందుకు గానూ భారీ మొత్తం లో డబ్బు తీస్కునే వారు.

సౌత్ కి కూడా పాకింది

సౌత్ కి కూడా పాకింది

అయితే ఇది మన టాలీవుడ్ లో మాత్రం తక్కువే పబ్లిక్ ఫంక్షన్ల కోసం యాంకర్లనీ, కమేడియన్లనీ తీసుకు రావటం తప్ప పేరున్న తారలు వచ్చి డాన్స్ చేయటం అనేది మన వైపు తక్కువే... అయితే ఈ తరహా వ్యవహారం ఇప్పుడు సౌత్ కి కూడా పాకింది పెళ్ళిళ్ళలో సినీ తారల చేత డాన్స్ చేయించటం అనేది ఒక స్టేటస్ సింబల్ గా మారుతున్న తరుణం లో గాలి జనార్థన రెడ్ది కూతురు వివాహం లో హీరోయిన్లతో డాన్స్ చేయించటం పెద్ద చర్చనీయాంశమే అయ్యింది...

మళ్ళీ గాలి ఇంట్లోనే

మళ్ళీ గాలి ఇంట్లోనే

అప్పుడు అక్కడ ఆడిన వాళ్ళలో శ్రద్దా దాస్ కూడా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫంక్షన్లో కూడా శ్రద్దా నర్తించి ఆహుతులని అలరించిందట... అయితే ఈ ఫంక్షన్ కూడా గాలి ఇంటనే కావటం విశేషం... గాలి జనార్ధన్ రెడ్డి పెళ్లి జరిగి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. భారీ స్థాయిలో పార్టీ ఇచ్చాడు.

డ్యాన్సులతో అలరించింది

డ్యాన్సులతో అలరించింది

ఇందులో పలువురు భామలు తమ డ్యాన్సులతో ఆహుతులను అలరించారు. వీరిలో శ్రద్ధా దాస్ కూడా ఉంది. బెంగళూరులో జరిగిన ఈవెంట్ లో ఈ భామ ఓ రేంజ్ లో తన డ్యాన్సులతో అందరినీ అలరించింది. అయితే ఇక్కడ డాన్స్ చేయటం పై ఎవ్వరూ పట్టించుకోలేదు ఎందుకంటే అది శ్రద్దా ఫ్రొఫెషన్ లో ఒక భాగమే కాబట్టి

ఎంత సీరియస్ గా తీసుకుంటుందో

ఎంత సీరియస్ గా తీసుకుంటుందో

కానీ ఆమె ఫ్రొఫెషన్ ని ఎంత సీరియస్ గా తీసుకుంటుందో ఆతర్వాత సంఘటనని చూస్తే తెలుస్తుంది. సహజంగా ఇలాంటి లైవ్ ఈవెంట్స్ కు బోలెడన్ని ఎనర్జీ లెవెల్స్ అవసరం కావడంతో.. కొంత అయినా రెస్ట్ తీసుకోవడం సహజం. కానీ బెంగళూరు ఈవెంట్ జరిగిన మరుసటి రోజునే షూటింగ్ కి అటెండ్ అయిపోయింది శ్రద్ధా దాస్.

ప్రవీణ్ సత్తారు

ప్రవీణ్ సత్తారు

అంత అలసి పోయినా తాను చేస్తున్న షూటింగ్ కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో రూపొందుతున్న పీఎస్వీ గరుడ వేగ చిత్రం షూటింగ్ కి అటెండ్ అయ్యింది. ఈ సినిమాలో రిపోర్టర్ గా నటిస్తోంది. నిజ జీవితం లో జర్నలిజం చదివిన శ్రద్దా ఇప్పుడు సినిమాలో జర్నలిస్ట్ గా కనిపించటం పై బాగా శ్రద్దగా పని చేస్తున్నట్టుంది...

English summary
Gali & his wife Aruna Lakshmi's 25th wedding anniversary was celebrated on a grand note. Actress Shraddha Das & few Kannada Heroines have sizzled on the stage. They made the atmosphere electrifying with their hot dance moves.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu