»   » ఇబ్బంది పెడుతున్నాడంటూనే పబ్లిగ్గా హగ్ చేసుకుంది : శ్రద్దా కపూర్ పై విమర్శలు

ఇబ్బంది పెడుతున్నాడంటూనే పబ్లిగ్గా హగ్ చేసుకుంది : శ్రద్దా కపూర్ పై విమర్శలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టార్ గా పేరుతెచ్చుకోవటం కంటే ఆ స్టార్ స్టేటస్ ని నిలుపుకోవటం చాలా కష్టం. ఒకప్పుడు సినిమా స్టార్స్‌ అంటే ఆ కిక్కే వేరు. స్టార్‌డమ్‌ ఆషామాషీగా వచ్చేది కాదు.. వచ్చిన స్టార్‌డమ్‌ని నిలబెట్టుకోవడం కోసం అప్పటి నటీనటులు పడ్డ కష్టం వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. ఆడియన్స్‌తో ఇంటరాక్షన్‌ అప్పుడు తక్కువ. ఇప్పుడు చాలా ఎక్కువ. సోషల్‌ మీడియా స్టార్స్‌ని, ఆడియన్స్‌ వద్దకు తీసుకెళ్ళిపోతోంది. ఇదే విషయాన్ని శ్రద్ధా కపూర్‌ చెబుతూనే, ఆనాటి స్టార్స్‌ ఇలాంటివేమీ లేకుండా తమను తాము స్టార్స్‌గా తీర్చిదిద్దుకోవడం, ఇంకా తమను తాము మెరుగుపర్చుకోవడం ఎలా సాధ్యమయ్యిందో తనకి ఇప్పటికీ అర్థం కావడంలేదని ఆశ్చర్యపోతోంది.

తనవరకూ తాను తన అభిమానులనుంచి వచ్చే ఫీడ్‌ బ్యాక్‌ని జాగ్రత్తగా పరిశీలిస్తాననీ, లుక్స్‌ దగ్గర్నుంచి, నటన వరకు ప్రతి విభాగంలోనూ అభిమానులు ఇచ్చే సూచనల్ని, సలహాల్నీ స్వీకరిస్తాననీ చెబుతోంది శ్రద్ధా కపూర్‌. ఒక్కోసారి, కొందరు పనిగట్టుకుని చెత్త కామెంట్స్‌ చేస్తుంటారనీ, అలాంటివారి నుంచి తప్పించుకోవడమూ కష్టమేనని ఆమధ్య ఒక ఇంటర్వ్యూలో వాపోయింది. మరి ఆ స్టార్ డం ని నిలబెట్తుకునే ప్రయత్నం లో భాగం గానే అబిమాన్లతో ఇంటరాక్షన్ మయింటైన్ చేయాలనుకుందో ఏమో గానీ పబ్లిక్ లో ఒక అభిమనిని కౌగిలించుకొని ఇప్పుడు విమర్శలతో సతమతమౌతోంది ఇంతకీ ఏం చేసిందీ అంటే...

Shraddha Kapoor can't stop herself to hug her biggest fan

బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ని ఇటీవల ఓకాలేజ్ ఫంక్షన్ లో అభిమాని వెంటాడాడు. ఎటు వెళ్లినా ఆమె వెంటే వస్తూ చిరాకుపుట్టించేలా ప్రవర్తించాడు. అతను అంతలా కన్నార్పకుండా చూస్తున్నా శ్రద్ధ బెదరకుండా అతడిని స్టేజ్‌పైకి పిలిచి అభిమాని అంటూ అందరికీ పరిచయం చేసి అందరి ముందు హగ్‌ కూడా చేసుకుంది. వూహించని ఈ పరిణామానికి సదరు అభిమానితో సహా ఒక్కసారిగా అందరూ షాక్‌తిన్నారు.

అలాంటి వారికి బుద్ధి చెప్పకుండా మరింత రెచ్చగొట్టేలా శ్రద్ధ ప్రవర్తించిందంటూ పలువురు ప్రముఖులు ఆమెపై విరుచుకుపడుతున్నారు. శ్రద్ధాకపూర్‌ చేసింది తప్పని చెప్తూ, ఎందుకు తప్పో వివరిస్తున్నారు. శ్రద్ధాకపూర్‌ సెలబ్రిటీ కాబట్టి ఆమెకి 24 గంటలూ సెక్యూరిటీ ఉంటుంది. వేధించే అభిమానుల నుంచి సురక్షితంగా బయటపడగలుగుతుంది. కానీ ఇలాంటి ఘటనలు సాధారణ ఆడపిల్లలు కూడా ఎదుర్కొంటుంటారు. సాధారణంగా యువతీ యువకులు సెలబ్రిటీలను అనుకరిస్తుంటారు కాబట్టి శ్రద్ధాకపూర్‌ చేసిన పని కరెక్ట్‌ అనుకుని ఆమెను అనుకరించే అవకాశం ఉంటుందని సైబర్‌ క్రైం అధికారులు, సైకాలజిస్టులు తదితరులు హెచ్చరిస్తున్నారు.

English summary
Wrong message sent by Shraddha Kapoor by hugging her stalker on national television
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu