»   »  టీవీ రిపోర్టర్ గా శ్రియ

టీవీ రిపోర్టర్ గా శ్రియ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Shreya
'లక్ష్య' సినిమాలో ప్రీతీ జింతా చేసినటువంటి టీ.వి.జర్నలిస్టు పాత్రలో శ్రియ ఇప్పుడు కనపడనుంది. శుక్రవారం రిలీవజవనున్న ఈ బాలీవుడ్ సినిమా పేరు 'మిషన్ ఇస్తాంబుల్' .అపూర్వ లఖియా దర్శకత్వం వహించే ఈ సినిమాలో కథ ఇంటర్ నేషనల్ టెర్రరిజం చుట్టూ తిర్గుతుంది. ఈ ఫిల్మ్ లో శ్రియ డిజప్పాయెంటెడ్ వైఫ్ అంజలిగా కనిపించనుంది. ఎప్పుడూ లక్ష్యం కోసం శ్రమించే జర్నలిస్టు వికాశ్ సాగర్ గా జియాద్ ఖాన్ కనిపిస్తాడు.

అతను విధి నిర్వహణలో భార్యని నిర్ళక్ష్యం చేస్తూంటాడు. ఆమె బాబు కావాలంటే కెరీర్ ఒక ఒడ్డుకు వచ్చేదాకా అలాంటివి వద్దంటాడు. ధాంతో ఆమె డైవర్స్ తీసుకుంటుంది. అలా వారి మధ్య జరిగే సంఘర్షణ, మరో ప్రక్క చెలరేగిపోతున్న టెర్రరిజం ఈ సినిమాలో ప్రధానాంశాలుగా కనిపిస్తాయి.ఇందులో శ్రియ అధ్బుతంగా నటించిందని బాలీవుడ్ మీడియా మోస్తోంది. అలాగే ఇంకా ఈ చిత్రంలో వివేక్ ఒబరాయ్,సునీల్ శెట్టి మెయిన్ గా కనిపిస్తే గెస్ట్ రోల్ లో అభిషేక్ బచ్చన్ ట్విస్టిస్తాడట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X