»   » బాయ్ ఫ్రెండును పెళ్లాడిన సింగర్ శ్రేయా ఘోషల్

బాయ్ ఫ్రెండును పెళ్లాడిన సింగర్ శ్రేయా ఘోషల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ వివాహం గురువారం ముంబైలో సింపుల్ గా జరిగింది. తన బాయ్ ఫ్రెండ్ శిలాదిత్యతో ఆమె వివాహం కొద్ది మంది బంధువులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఫిబ్రవరి 5న జరిగింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా ఖరారు చేయడంతో పాటు తన భర్తతో దిగిన ఫోటోను పోస్టు చేసింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Shreya Ghoshal ties the knot with beau Shiladitya

శిలాదిత్యతో శ్రేయా ఘోషల్ గత కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తోంది. అయితే జనవరి 30 ఆమె చేసిన ట్వీట్ అభిమానుల్లో కాస్త గందరగోళానికి దారి తీసింది. ‘ఏమైందో తెలియడం లేదు...ఒక వైపు నర్వస్, మరో వైపు ఎక్సైట్మెంట్. ఏ విషయం అనేది త్వరలోనే తేలుతుంది. మీ ఆశీస్సులు కావాలి' అంటూ ట్వీట్ చేసింది.

ఆమె అలా ట్వీట్ చేయడంతో అభిమానులకు అర్థం కాలేదు. ఎట్టకేలకు ఈ రోజు(ఫిబ్రవరి 6) తమ పెళ్లి శుభవార్తను అభిమానులకు తెలియజేసారు. ‘నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడాను. గత రాత్రి దగ్గరి బంధువులు, స్నేమితుల సమక్షంలో వివాహం జరిగింది. కొత్త జీవితం ఎక్సైటింగ్ గా ఉంటుందనుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేసింది.

English summary
Bollywood playback singer Shreya Ghoshal recently tied the knot with long-time beau Shiladitya in a quiet ceremony on February 5.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu