»   » శ్రియ సైడ్ బిజినెస్ ఖరీదు ఐదు నిమిషాలకు పది లక్షలు...!?

శ్రియ సైడ్ బిజినెస్ ఖరీదు ఐదు నిమిషాలకు పది లక్షలు...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ మధ్య తారలు.. ఆయా ప్రత్యేక కార్యక్రమాల్లో స్పెషల్ డ్యాన్సులు చేయడం ద్వారా మంచి ఆదాయాన్నే సమకూర్చుకుంటున్నారు. అది అవార్డుల ఫంక్షన్స్ కావొచ్చు.. లేదా ప్రత్యేకంగా ఎవరైన సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకుంటే అందులో కావొచ్చు.. ధనవంతుల పెళ్లిళ్లు కావొచ్చు.. ఏదైనా 5 నిముషాల డ్యాన్స్ కు బాగానే గిట్టుబాటు అవుతుందట. వీటిలో కొందరు ఎంతెంత చార్జ్ చేస్తారో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. జెనీలియా, శ్రియ వంటి తారలు ఒక్కపాటకు డ్యాన్స్ చేయడానికి పది లక్షలు వసూలు చేస్తారు. సీసీఎల్ ఫైనల్ మ్యాచ్ లో శ్రియ డ్యాన్స్ చేసి.. ఇంత మొత్తాన్ని సంపాదించారు.

ఇక ప్రియమణి, నమిత, చార్మిలకు అయితే 5 నుంచి 6 లక్షల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాక ఫైవ్ స్టార్ హోటల్ సదుపాయం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రియమణి, విమలా రామన్, చార్మిలు ఈ మధ్య ఒక అవార్డ్ ఫంక్షన్ లో ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. కామ్నాజెఠ్మలానీ, గౌరీముంజల్, పూనమ్ భజ్వా, శ్వేతాబసు ప్రసాద్, పార్వతీ మెల్టన్, శ్రద్ధాదాస్ వంటి హీరోయిన్లకు 2 నుంచి 3 లక్షల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. వీరికి త్రీ స్టార్ హోటల్ సదుపాయాలిస్తే సరిపెట్టుకుంటారు. ఇక ఈ సారి తానా సభలకు శ్రియ నిత్యమీనన్ లు అతిథులుగా వెళ్తుంటే.. నాట్స్ వేడుకలకు ప్రియమణి వెళ్తున్నారట. ఈ విదేశాల్లో చేసే ప్రదర్శనలకైతే రెట్టింపు పారితోషికం అడుగుతారు. అయితే ఇంకా ఈ డ్యాన్సుల జోలికి రానీ మరికొంతమంది కథానాయకులున్నారు. అనుష్క, సమంత, ఇలియాన, కాజల్ వంటి కొద్దిమంది మాత్రం ఇలాంటి నిత్య ప్రదర్శలనకు దూరంగానే ఉంటున్నారు.

English summary
Shriya might have very less offers now but she had all the chances to make easy money. Shriya is the star attraction the TANA celebrations this year..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu