»   » శ్రియ కి ఇదేం పిచ్చి!? బాలయ్యతో చేస్తూనే, నెగెటివ్ రోలా ??

శ్రియ కి ఇదేం పిచ్చి!? బాలయ్యతో చేస్తూనే, నెగెటివ్ రోలా ??

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రియ లేటు వయసులో ప్రయోగాలు చేస్తుంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుముఖం పడుతున్న సమయంలో ప్రయోగాలకు అవకాశం చుడుతుంది. ప్రస్తుతానికి చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు ఉన్నప్పటికీ మార్కెట్ ని మరింత పెంచుకోవడం కోసం నెగిటివ్ రోల్స్ కూడా ఓకే చేస్తున్నది.

మరోసారి బాలయ్యతోనే

మరోసారి బాలయ్యతోనే

బాలయ్య తో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చేసి విజయం అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు మరోసారి బాలయ్యతోనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేస్తుంది. తమిళ్ లో కూడా శింబుతో ఓ సినిమాలో రొమాన్స్ చేస్తోంది. అలానే.. నరకాసురన్ అనే మూవీలో నెగటివ్ రోల్ చేసేందుకు ఓకే చెప్పిందని తెలుస్తోంది.

కార్తీక్‌నరేన్‌

కార్తీక్‌నరేన్‌

దీనికి సృష్టికర్త నవ దర్శకుడు కార్తీక్‌నరేన్‌. తొలి చిత్రంతోనే శభాష్‌ అనిపించుకున్న ఈ వర్ధమాన దర్శకుడు తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రం పేరే నరకాసురన్‌. ఇందులో అరవిందస్వామి ప్రధాన పాత్ర పోషించనున్నారు. యవ కథానాయకుడిగా టాలీవుడ్‌ యువ హీరో నాగచైతన్య నటించడానికి అంగీకరించినా, ఇప్పుడు వైదొలగినట్లు టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది.

మరో టాలీవుడ్‌ నటుడి కోసం

మరో టాలీవుడ్‌ నటుడి కోసం

కారణం చైతు త్వరలో తన ప్రేయసి సమంతను వివాహమాడబోతుండడమేనని సమాచారం. ఆయన పాత్రలో మరో టాలీవుడ్‌ నటుడి కోసం వేట మొదలైందని తెలుస్తోంది. ఇందులో ప్రతినాయకిగా శ్రియ నటించనుందట. కథ వినగానే తన పాత్ర తెగ నచ్చేయడంతో విలనీయం ప్రదర్శించడానికి శ్రియ సిద్ధం అనేసిందట.

గౌతమ్‌మీనన్‌

గౌతమ్‌మీనన్‌

మరో విషయం ఏమిటంటే ఆ చిత్ర కథ నచ్చడంతో ప్రముఖ దర్శకుడు గౌతమ్‌మీనన్‌ తానే నిర్మించడానికి ముందుకు వచ్చారట. చిత్ర షూటింగ్‌ ఆగస్ట్‌లో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే చిత్ర దర్శకుడు కార్తీక్‌నరేన్‌ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకోనున్నాడట.

English summary
Tollywood actress Sriya saran ready to act in negative role in Narakasuran.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu